విదేశీ మహిళ కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి అయిన బొమ్మిశెట్టి సిద్ధయ్యను రాత్రి,పగలు తేడా లేకుండా తిప్పుతూ ఇబ్బందులకు గురిచేయడం
విదేశీ మహిళ కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి అయిన బొమ్మిశెట్టి సిద్ధయ్యను రాత్రి,పగలు తేడా లేకుండా తిప్పుతూ ఇబ్బందులకు గురిచేయడం ఏమిటంటూ దిశాపోలీసులను ప్రశ్నించిన మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సిద్దయ్యను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన కుటుంబీకులు టిడిపి నాయకులకు మొర పెట్టుకోవడంతో దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన టిడిపి బృందం. దిశ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ,నెల్లూరు నగర ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. సైదాపురం మండలం రాగనరామాపురంలో కొందరు వ్యక్తులు విదేశీ యువతిని మాయమాటలు చెప్పి అడవుల్లోకి తీసుకెళ్తుంటే అది గమనించిన సిద్దయ్య ఆ యువతిని రక్షించి పోలీసులకు సమాచారం అందించాడు.
విదేశీ మహిళ కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి...ఆ మహిళను రక్షించిన బొమ్మిశెట్టి సిద్దయ్య ను విచారణ పేరుతో రాత్రంతా తిప్పాల్సిన అవసరం ఏముందని పోలీసులను నిలదీసిన టీడీపీ బృందం. సీన్ ఆన్ ఆఫెన్స్ కు ఉదయం పూట వెళ్లాల్సింది పోయి రాత్రి పూట కూడా వెళతారా అంటూ పోలీసులను ప్రశ్నించిన సోమిరెడ్డి. టీడీపీ నాయకులు దిశా స్టేషన్ కు చేరుకుని పోలీసులను ప్రశ్నించడంతో సిద్దయ్యను రిపోర్ట్ తీసుకొని పంపిచేస్తామని తెలిపిన పోలీసులు. పథకం ప్రకారమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తుంది. అందుకోసమే ప్రత్యక్ష సాక్షి అయిన బొమ్మిశెట్టి సిద్దయ్య ను భయబ్రాంతులకు గురిచేసేందుకే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు.