*హోమ్ క్వారంటైన్ పై వాలంటీర్లు దృష్టి పెట్టాలి*
 . *జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి*

*కోవిడ్-19 సోకిన బాధితులు హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు వారిపై వాలంటీర్లు ప్రధానంగా దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి సూచించారు .నెల్లూరు నగరంలోని నుడా కార్యాలయం నుంచి ఆయన జిల్లాలోని వార్డు వాలంటీర్లు, సెక్రటరీ లతో ధూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వాలంటీర్లు మరింత క్రియాశీలకంగా పనిచేయాలన్నారు.. తమ పరిధిలో ఎవరైనా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారా ..వారి పరిస్థితి తదితర అంశాలను ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో అందజేయాలన్నారు.. క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్  గుర్తింపు లో వాలంటీర్ల పాత్ర కీలకమన్నారు. ఈ సందర్భంగా ఆయన వార్డు కార్యదర్శులకు వాలంటీర్లకు పలు సూచనలు జారీ చేశారు.*