077 కాల్ సెంటర్ వినియోగించుకోండి
జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి
కరోనా వైరస్ కు సంబంధించి సమాచారం ఇతర అవసరాల కోసం 1077 కాల్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ తో సమావేశం అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. కరోనా వైరస్ కు సంబంధించి ఏర్పాటు చేసిన 1077 కు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రజలు కూడా ఏమైనా సందేహాలు ఉన్నా వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. జిల్లాలో కరోనా వైరస్ బాధితుల సేవలందించడంలో జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందన్నారు. అలాగే 104 సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు