ఏపీలో 'జగనన్న విద్యాకానుక' ప్రారంభం
October 08, 2020
ap
,
CM
,
Nellore
,
vidya kanuka
,
YS Jagan
,
YSRCP
'జగనన్న విద్యాకానుక' పథకాన్ని కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. తొలుత జిల్లా పరిషత్ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించిన సీఎం అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు.
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థులకు ప్రభుత్వం కిట్లు పంపిణీ చేస్తోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీవీబీ, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందిస్తున్నారు. కిట్‌లో ఒక్కో విద్యార్థికి మూడు జతల ఏకరూప దుస్తులు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు అందిస్తారు. 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్క్ బుక్స్, 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగ్ ఇస్తారు.