వచ్చే ఏడాది కావలి లో కేంద్రీయవిద్యాలయం.....ఎంపీ ఆదాల
January 21, 2020
adala
,
bjp
,
Kavali
,
mp
,
venkaiah naidu
,
ycp
నెల్లూరు ఎంపీ ఆదాలకు కేంద్ర మంత్రి హామీ
కావలిలో భూమిని కేటాయిస్తే వచ్చే ఏడాది నుంచి కేంద్రీయ విద్యాలయా నికి సహకరిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి హామీనిచ్చారు.వెంకటాచలం లో మంగళవారం ప్రాచీన అధ్యయన తెలుగు కేంద్రం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ విషయమై మాట్లాడారు. అంతకుముందు అక్షర విద్యాలయం లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ,కేంద్ర మంత్రి ని కలిసి పుష్ప పుష్పగుచ్ఛాలు అందించారు. శాలువాలతో ఘనంగా సత్కరించారు .ఈ సందర్భంగా వారితో సాగిన మాటామంతి లో జిల్లా సమస్యల ప్రస్తావన చేసి ఆయన నుంచి ఆ హామీని రాబట్టారు .