తిరుపతి జిల్లా  నాయుడుపేట

మే డే 01-05-2022 రోజున సాయంత్రం  4. గంటలకు నాయుడుపేట సీ ఐ టి యూ కార్యాలయం ప్రారంభోత్సవం,

తిరుపతి జిల్లా నాయుడు పేట లోని కూరగాయల మార్కెట్ వెనుక ఉన్న వేదన పర్తి సుందర రామిరెడ్డి భవన్
( సి ఐ టి యూ కార్యాలయం) ప్రారంభోత్సవం జరుగుతుందని ఇండస్ట్రియల్ కారిడార్ కార్యదర్శి ,
యం మోహన్ రావు తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే డే  రోజున జరిగే ప్రారంభోత్సవానికి, ముఖ్య అతిథులుగా, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం పిడిఎఫ్ ఎమ్మెల్సీ, యుoడపల్లి శ్రీనివాసులు రెడ్డి, సీ ఐ టి యూ రాష్ట్ర అధ్యక్షులు, సిహెచ్ నరసింహారావు, సీ ఐ టి యూ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్. నరసింగరావు, సీ ఐ టీ యూ,రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, సీ ఐ టి యూ నెల్లూరు జిల్లా, ప్రధాన కార్యదర్శి, కటారి అజయ్ కుమార్, తిరుపతి, నెల్లూరు, జిల్లాల
సీ ఐ టి యూ నాయకులు, ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటారని ఆయన తెలిపారు, అదే రోజున, సాయంత్రం మూడు గంటలకు, అంబేద్కర్ విగ్రహం వద్దనుండి ప్రదర్శన, అనంతరం సీ ఐ టీ యూ,కార్యాలయం వద్ద జరిగే బహిరంగ సభలో కార్మికులు ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో
సీ ఐ టీ యూ మండల కార్యదర్శి నాయకులు ముకుంద, మేనకూరు క్లస్టర్ కన్వీనర్ చాపల వెంకటేశ్వర్లు, భోజన పథకం కార్యదర్శి, విజయమ్మ, సీ ఐ టీ యూ మండల అధ్యక్షుడు మహేష్, వీరస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు