🔸వైకాపా దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడి నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేమా హజరత్ కుమార్ ను పరామర్శించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తాళ్లపాక అనూరాధ, వేమిరెడ్డి
పట్టాభిరామిరెడ్డి, జెన్ని రమణయ్య తదితరులు...
🔸హజరత్ పై దాడిని తీవ్రంగా ఖండించిన సోమిరెడ్డి..
🔸సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హజరత్ పై బాటిళ్లతో తలపై, చేతులతో శరీరంపై దాడిచేయడం దుర్మార్గం..
🔸ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం జరిగితే బెయిలబుల్ కేసుతో సరిపెట్టడం దురదృష్టకరం..
🔸టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం జరిగితే బెయిలబుల్, చంద్రబాబు నాయుడు ఫొటోలతో మా నాయకులు సేవా కార్యక్రమాలు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులా..
🔸రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎన్నో ఉద్యమాలు చేశాం..మా జోలికి ఎవరూ రాలేదు..
🔸మా ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎన్నో నిరసనలు తెలిపింది..వారి జోలికీ మేము వెళ్లలేదు..
🔸వైసీపీ ప్రభుత్వ హయాంలో నేర సంస్కృతి పెరిగిపోయింది..
🔸ప్రజాస్వామ్య దేశంలో రోడ్డెక్కి నిరసన తెలిపే హక్కు లేదని చట్టాలు మార్చేయండి..
🔸కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసోసియేషన్ నాయకులు స్పందించాలి..
🔸సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారిని నిరంకుశంగా అణిచేప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగవు..తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు..