పాత కక్షలను మనసులో ఉంచుకుని వేదయపాలెం బిజెపి మండల అధ్యక్షులు పి.మల్లికార్జున మీద మారణాయుధాలతో దాడి..
December 17, 2020
attack
,
bjp
,
case
,
Crime
,
mallikarjuna
,
Nellore
,
police
,
vedaypalem
పాత కక్షలను మనసులో ఉంచుకుని వేదయపాలెం బిజెపి మండల అధ్యక్షులు పి.మల్లికార్జున మీద మారణాయుధాలతో దాడి..
గతంలో వేదయపాలెం, మహాత్మా గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న బిజెపి నాయకుడు పి.మల్లికార్జున ఇంటిపై ఫతేఖాన్ పేట సంబంధించిన బెల్లం. మణికంఠ అనే వ్యక్తి పూటుగా మద్యం సేవించి మల్లికార్జున ఇంటిపై దాడి ప్రయత్నం చేశాడు. ఈ విషయమై 5 వ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినందుకు గాను పై విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కక్ష తీర్చుకొనేందుకు బెల్లం.మణి కంఠ అతని అన్న బెల్లం.శివ,తండ్రి రవి,మరియూ తన స్నేహితులతో కలిసి నగరంలో తన పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న పి.మల్లికార్జున,స్నేహితుడు పల్లిపాటి.శ్రీనివాసులు పై మూలాపేట రామయ్య బడి వద్ద కాపుగాచి మారణాయుధాలతో దాడి చేశారు.గాయపడిన ఇద్దరూ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.