*న్యూఢిల్లీ*

_*నవంబర్​ నెలాఖరు వరకు అన్​లాక్​-5 నిబంధనలే*_

*అన్​లాక్​-6 కొత్త నిబంధనలను కేంద్రం విడుదల చేసింది.*

*- కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నందున సెప్టెంబర్‌ 30న ఇచ్చిన ఆదేశాలను మరో నెల రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ.*

★ అన్‌లాక్​-6 నిబంధనలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. 

★ సెప్టెంబర్‌ 30న ఇచ్చిన అన్​లాక్​-5 ఆదేశాలను మరో నెల రోజులు పొడిగిస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. 

★ కరోనా విస్తరణ ఇంకా కొనసాగుతున్నందున జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్రం సూచించింది.

★ కంటైన్మెంట్‌ జోన్లలో అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది హోంశాఖ. 

★ కంటైన్మెంట్‌ జోన్ల బయట... దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. 

★ కంటైన్మెంట్‌ జోన్ల బయట రాష్ట్రాలు లాక్​డౌన్​ విధించకూడదని తాజా మార్గదర్శకాల్లో చెప్పింది కేంద్రం.

_*అన్​లాక్​-6 నిబంధనలు..*_

★ సామాజిక, క్రీడా, విద్యా, వినోద, సాంస్కృతిక, రాజకీయ సమావేశాలకు 200 మంది వరకు హాజరయ్యేందుకు అవకాశం.

★ కరోనాను ఎదుర్కోవడానికి ఈ నెల 8న ప్రధాని ప్రారంభించిన 'జన ఆందోళన్​'లో భాగస్వాములు కావడం.

★ మాస్క్‌లు ధరించడం, చేతులు తరచూ శుభ్ర పరుచుకోవడం, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి.

★ ఈ మూడు పాటించేందుకు అవసరమైన ప్రచారం కల్పించాలని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేపట్టాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు హోంశాఖ ఆదేశించింది.

★ రాష్ట్రాల మధ్య రాకపోకలకు ప్రభుత్వాలు ఎటువంటి అంతరాయం కల్పించకూడదు.

★ 10ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన పెద్దలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు అత్యవసరం అయితేనే బయటికి రావాలి.

★ అంతర్జాతీయ ప్రయాణికులు, ఈత కొలనులు, వ్యాపార సమావేశాలు, వ్యాపార సంబంధిత ఎగ్జిబిషన్లు, సినిమా హాళ్లలో 50 శాతం వరకు అవకాశం కల్పిస్తూ.. సెప్టెంబర్‌ 30 ఆదేశాలు ఇచ్చిన కేంద్ర హోం శాఖ.. ఇవే ఆదేశాలు నవంబర్ నెలాఖరు వరకు కొనసాగుతాయని పేర్కొంది.