పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్ట్ నాదని నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా...

ఉదయగిరి మాజీ శాసన సభ్యులు బోలినేని రామారావు*



👉సజ్జల రామకృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్,  సాక్షి మీడియా లకు సవాల్ విసిరిన ఉదయగిరి మాజీ  శాసనసభ్యులు బొల్లినేని రామారావు.


👉గత కొద్ది రోజులుగా  సాక్షి మీడియా నాపై పులిచింతల ప్రాజెక్టు కట్టింది నేనేనని వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.


👉వారికిదే నా సవాల్ పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్ట్ నాదేనని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకునేందుకు సిద్ధం.

  

👉పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగి పోవడానికి కారణం నేనేనని సాక్షి మీడియా నాపై విష ప్రచారం చేస్తుంది ఇదే తొలిసారి కాదు ఇదే మాదిరి 2017 సంవత్సరం నుంచి నాపై అబద్ధపు ప్రచారం.. కథనాలు ప్రచురిస్తున్నది.


👉2004 వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ప్రారంభమైన పులిచింతల ప్రాజెక్టు నాకెలా కాంట్రాక్టు ఇస్తారు, నాకు గాని నా కంపెనీకి సంబంధం లేని విషయంలో మీరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.


👉గతంలో సాక్షి పత్రిక లో నేను 280 కోట్ల అవినీతి చేసినట్లు తప్పుడు ప్రచారాలు చేశారు కిరాణా షాపుల మాదిరిగా పట్టిక తయారు చేసి ప్రచురించారు ఇసుకలో 150కోట్లు అవినీతి చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేశారు.


👉ఉదయగిరి నియోజకవర్గంలో ఇసుక  ఎక్కడ దొరుకుతుందో మీరే చెప్పండి అని నేను ప్రశ్నిస్తున్నా. అలాంటిది ఇసుక లేని దగ్గర 150 కోట్ల అవినీతి ఎలా చేస్తాను ఉదయగిరి నియోజకవర్గం లో పెన్నానది లేదు.


 👉పులిచింతల ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు మీ పార్టీ సభ్యులే ప్రస్తుతం మీ పార్టీలోనే ఉన్నారు  దీని పై  నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడమని సజ్జల,అనిల్ కుమార్ యాదవ్ గార్లకు తెలియజేస్తున్నాను.


👉నా కంపెనీ పేరు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నేను ఈ రాష్ట్రంలో  కాంట్రాక్టు పనులు చేయటం లేదు.. పక్క రాష్ట్రంలో పనులు చేసుకుంటున్నాను.

నా పై ఇక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరి కాదు నాపై చేసిన తప్పుడు ఆరోపణలకు క్షమాపణ చెప్పకపోతే సాక్షి మీడియా పై లీగల్ గా పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది.