10 శాతం పెరగనున్న టోల్‌గేట్ ఫీజు!
August 26, 2020
ap
,
hike
,
Nellore
,
tamilnadu
,
toll plaza
,
toll rates
తమిళనాడులో త్వరలో టోల్‌గేట్ ఫీజులు పెరగనున్నాయి. రాష్ట్రంలో ఉన్న 21 టోల్‌గేట్‌లలో వచ్చేనెల 1 నుంచి 10 శాతం ఫీజు పెంచాలని జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. కరోనా లాక్‌డౌన్ రవాణా రంగంపై భారీగా ప్రభావం పడిందని, దీంతో టోల్‌గేట్ ఫీజును రద్దుచేయాలని లారీ యజమానులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా రాష్ట్రంలోని 21 టోల్‌గేట్‌లలో ఫీజులు పెంచడానికి ఎన్‌హెచ్ఏఐ రంగం సిద్ధం చేసింది. జాతీయ రహదారుల చట్టం 2008 ప్రకారం ప్రతి ఏడాది టోల్‌ఫీజులు పెరుగుతాయని, ఇది సాధారణంగా కొనసాగే ప్రక్రియేనని అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడ నుందని తెలిపారు.
తమిళనాడులోని పుదూర్‌పాండియాపురం (విరుదునగర్), ఏలియార్‌పతి (మదురై), రాజంపాళయం (నామక్కల్), నత్తక్కరై, ఓమలూరు (సేలం), వీరచోళపురం, సమయపురం, పొన్నాంబలపట్టి, తిరుప్పరాయతురై (తిరుచ్చి), వాల్వదాన్‌కోట (తంజావూరు), కోటై రోడ్డు (దిండుగల్), పాళయం (ధర్మపురి), విజయమంగళం, తిరుమాన్‌తురై, మోరప్పాండి, విక్కిరవాండి (విల్లుపురం) సహా 21 టోల్‌గేట్‌లలో ఫీజు 3-5 శాతం అంటే రూ.5 నుంచి గరిష్టంగా రూ.15 వరకు పెరుగనుంది. అయితే వాహనాన్ని బట్టి టోల్ ధరల్లో తేడాలు ఉండనున్నాయి.
అయితే ఈనిర్ణయాన్ని తమిళనాడు లారీ యజమానుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల లారీలు ఉన్నాయని, ఒక లారి ఏడాదికి రూ.50 వేలు చెల్లించదని అనుకుంటే ప్రభుత్వానికి టోల్‌గేట్ల ద్వారా రూ.25 వేల కోట్లు సమకూరుతున్నాయని వెల్లడించాయి. అయితే టోల్ ఫీజులు పెంచడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొన్నాయి.