ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్థే చర్యలు తప్పవు..కమిషనర్ పి.విశ్వనాథ్
ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్థే చర్యలు తప్పవు ....... నగరంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు*
చిత్తూరు : నగర
కమిషనర్ పి.విశ్వనాథ్ మంగళవారం ఉదయం నగరంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఉదయం గాంధీ రోడ్డు కూడలి నుంచి ఎమ్మెస్సార్ వరకు రహదారులపై కి వచ్చిన ఆక్రమణల తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పైకి వచ్చిన ఆక్రమణలను ప్రాథమికంగా తొలగించాలని నగరపాలక సంస్థ ప్రణాళిక విభాగం అధికారులకు సూచించారు. అనంతరం కమిషనర్ 5వ వార్డు పరిధిలో పర్యటించారు. స్థానికంగా జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు నిల్వ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కమిషనర్ వెంకట నాగేంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ జగన్ ఉన్నారు.