ఈనెల 17వ తారీఖున జరగబోవు తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికలు పోటీ చేయనున్న
వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అత్యధిక మెజార్టీతో గెలిపించి అందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని వైయస్సార్సీపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు గురువారం కోటలోని నల్లపురెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూగత ఎంపీ ఎన్నికలలో ఇచ్చిన మెజారిటీ కన్నా ప్రస్తుత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చేటట్లు డాక్టర్ గురుమూర్తి ఆశీర్వదించాలని వారు కోరారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని వారు తెలిపారు ఈనెల 4వ తేదీన కోటలో జరగనున్న మహా బహిరంగసభ విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గూడూరు వైయస్సార్సీపి ఉప ఎన్నికల ఇంచార్జ్ వైఎస్ఆర్సిపి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద రావు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు విజయ్ కుమార్ యాదవ్ మధుసూదన్ రెడ్డి సాయి రెడ్డి సుధా రెడ్డి ఎస్ కె మొబిన్ భాష తదితరులు పాల్గొన్నారు