సూళ్లూరుపేట S.V.S.S.C ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వర్క్ షాప్
సూళ్లూరుపేట S.V.S.S.C ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వర్క్ షాప్ ను ప్రారంభించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎస్. ఎల్ బి. శంకర్ శర్మ.
నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట:-
పట్టణంలోని S.V S.S.C గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో "రెన్యువబుల్ ఎనర్జీ సోర్సెస్" అనే అంశం మీద నేడు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎస్ ఎల్ బి శంకర్ శర్మ వర్క్ షాపును ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ వర్క్ షాపు నేటి తరానికి సాంప్రదాయ, ఇంధన వనరులు విరివిరిగా అవసరమని తెలిపారు. ఈ సదస్సులో భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్. వి రాజా మాట్లాడుతూ దేశ అభివృద్ధి ఆ దేశంలోని శక్తి వనరులు వినియోగంపై ఆధారపడుతుందని వివరించారు. అనంతరం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం డాక్టర్. వైయస్ఆర్ డిగ్రీ కళాశాల ఫిజికల్ అధ్యాపకులు డాక్టర్. పి వెంకటేష్ మాట్లాడుతూ ఈ వర్క్ షాపు యొక్క ఉపయోగాన్ని గురించి విద్యార్థులకు వివరించారు.ఆ అనంతరం నెల్లూరు జిల్లా విడవలూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ అధ్యాపకులు ఎస్. కె . న్యాముతుల్లా మాట్లాడుతూ వివిధ రకాల సాంప్రదాయేతర ఇంధన వనరులను గూర్చి సమూలంగా ఉపాధ్యాయులకు, విద్యార్థి, విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భౌతిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సుబ్రమణ్యం, డిగ్రీ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.