రాజధాని విషయం లో టిడిపి, వైసిపి లే ప్రజలను మోసం చేశాయి - సోము వీర్రాజు బిజెపి ఎపి అధ్యక్షులు
విజయవాడ
సోము వీర్రాజు బిజెపి ఎపి అధ్యక్షులు
అమరావతి విషయంలో టిడిపి, వైసిపి కంటే మా బిజెపి స్పష్టమైన వైఖరి తో ఉంది. రెండేళ్లలో ఇక్కడే సొంత పార్టీ కార్యాలయం కూడా ప్రారంభిస్తాం. అమరావతి లో తొమ్మిది వేల ఎకరాలను చంద్రబాబు అభివృద్ధి చేయాల్సి ఉన్నా చేయలేదు. ఎయిమ్స్ ను తక్కువ ఖర్చుతో కేంద్రం నిర్మాణం చేసి చూపించింది. ఆనాటి, నేటి ప్రభుత్వాలు కనీసం రోడ్ కు స్థలం ఇవ్వలేదు. రాజధాని విషయం లో టిడిపి, వైసిపి లే ప్రజలను మోసం చేశాయి.హైకోర్టు రాయలసీమ లో ఉండాలని బిజెపి విధానానికి కట్టుబడి ఉంది
చంద్రబాబు రాజధానికి కేంద్రం కేటాయించిన నిధుల లెక్కలు చెప్పాలి. జగన్ ప్రభుత్వం కూడా గొప్పలుచెప్పుకోవడం తప్ప.. చేతల్లో చూపించడం లేదుగత ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టు లను వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందిగడ్కరీ.. స్వయంగా చంద్రబాబు ను విశాఖ పిలిపించి నిధుల పై చర్చించారు. అన్ని పార్టీ ల జాతకాలు చెప్పే లగడపాటి రాజగోపాల్.. రెండేళ్ళ ఎంపిగా దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం చేయలేక పోయారు. కేశినేని నాని ఒక. లేఖ ఇవ్వగానే గడ్కరీ స్పందించి ఫ్లైఓవర్లకు నిధులు ఇచ్చి పూర్తి చేశారు.టిటిడి నుంచి డిపాజిట్ సొమ్మలు తీయవద్దంటూ ప్రభుత్వానికి లేఖ రాశాం.. వరదల పై పరిశీలించి.. సాయం చేయాలని లేఖ రాస్తే కేంద్రం వెంటనే స్పందించింది.మాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. రాష్ట్ర అభివృద్ధి కే మా ప్రాధాన్యత.టిడిపి, వైసిపి ప్రభుత్వం లో అవినీతి జరిగింది.సెంటు స్థలం పేరుతో .. పట్టాల పంపిణీ అంటూ.. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచేశారు.దీని పై చంద్రబాబు ఎందుకు స్పందించరు.. ప్రభుత్వాన్ని నిలదీయరా.అంటే.. అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు అవినీతి లో భాగస్వామ్యులే.టిడిపి, వైసిపి కుటుంబ పార్టీ లు అనేది వాస్తవం.నీరు..చెట్టు పేరుతో కోటి మొక్కలు పెంచేస్తామని ప్రగల్భాలు.ఇందులో కూడా వేల కోట్ల అవినీతి జరిగిందనేది వాస్తవం. 21కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టు ల పై అధ్యయనం చేసి.. వైసిపి ప్రభుత్వం లో ఎమ్మెల్యే ల అవినీతి ని బయట పెడతాం. పోలవరం విషయంలో వైసిపి అనవసర రాద్దాంతం చేస్తుంది. మాకు టిడిపి, వైసిపి అయినా రెండూ మాకు ప్రతిపక్ష పార్టీలే. మా పార్టీ కి ఒకవిధానం ఉంది.. ఆ విధానం బట్టే చానల్స్ డిబేట్లకి పంపిస్తాం.ప్రజా సమస్య ల పై బిజెపి, జనసేన లు కలిసి త్వరలో ప్రజా ఉద్యమం చేపడతాం