జనసేన - టిడిపి ప్రభంజనం సృష్టించబోతుంది
2024లో టిడిపి అధికారంలోకి రావడాన్ని ఎవ్వరూ ఆపలేరు
నేదురుపల్లి పంచాయతీ యర్రబల్లి గ్రామంలో 20 కుటుంబాలు టిడిపిలో చేరిక
మంత్రి కాకాణి ఈసారి ఎన్నికల్లో గెలిస్తే నడిరోడ్డులో సర్వేపల్లిని అమ్మేస్తాడని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు ,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
సోమవారం మండలంలోని నేదురుపల్లి పంచాయితీలోని యర్రబల్లి గ్రామంలో బాబు షూరిటీ - భవిషత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న సోమిరెడ్డి.
ఇంటింటికి కరపత్రాలు పంచి ,ప్రజలతో మమేకమై అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సోమిరెడ్డి
సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టిన యర్రబల్లి గ్రామస్తులు
యర్రబల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు వై.సి.పి నీ వీడి టిడిపి పార్టీలో చేరారు.
వారికి సోమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు పెరిగాయన్నారు
సర్వేపల్లి లో ఇది ఇంకా ఎక్కువగా ఉందన్నారు. వైసీపీ నాయకులు ప్రకృతి సంపదలను కొల్లగొట్టి కోట్ల రూపాయలను దోచుకొని దాచుకుంటున్నారన్నారు. తనకి గత రెండు ఎన్నికల్లో మెజారిటీ తగ్గిన అభివృద్ధి చేశామన్నారు.
కానీ మంత్రి కాకాణి దగ్గరకు ఇటీవల తోటపల్లి గూడూరు గ్రామస్తులు వెళితే మీ మండలంలో నాకు మెజారిటీ తగ్గిందని మీకెందుకు చేయాలని ప్రశ్నించారన్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ను మూసేశారన్నారు.
టీడీపీ ప్రభుత్వం వర్క్ ఆర్డర్ ఇచ్చి మొదలు పెట్టిన పనులను కూడా అధికారంలోకి రాగానే 25% లోపల పనులు జరిగిన వాటిని వైసీపీ ప్రభుత్వం ఆపేసిందన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రిగా వుండి మండలంలో మొదటి పంటకే 12 వేల ఎకరాల భూమిని బీడు పెట్టించిన ఘనత మంత్రి కాకానికే దక్కిందన్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు కండలేరు లో 8 టీఎంసీలు నీరు ఉన్నప్పుడే రైతులకు నీరు ఇచ్చామన్నారు.
రెండు రోజుల కిందట మరో రెండు రోజుల్లో నీరు ఇవ్వకుంటే నిరాహార దీక్ష చేస్తామన్న టిడిపి నాయకులు, తాము పోరాడితే ఆదివారం ఎడమ కాలువకు నీరు వదిలారు అన్నారు.
సోమశిల ఆఫ్రాన్, సర్వేపల్లి చెరువు టెండర్ పనులు మధ్యలోనే ఆపేసిన ఆ పనులు పూర్తిచేసే దిక్కు లేదన్నారు.
సోమశిల అఫ్రన్ పూర్తి కాకుంటే ఏ క్షణమైనా ప్రమాదం జరగవచ్చునన్నారు.
సర్వేపల్లి భూ పంపిణీలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ,బినామీ పేర్లతో పొలాలను వైసిపి నాయకులు దోచుకుంటున్నారన్నారు.
ఒక బత్తులపల్లి వీఆర్ఏనే 14 ఎకరాలు వారి కుటుంబ సభ్యుల పేరుతో రాసుకున్నారని దీనిపై కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశామన్నారు.
టిడిపిలో అధికారంలోకి రాగానే నిజమైన రైతుల భూమును ఈ ప్రభుత్వ పెద్దలు,అధికారులు అక్రమంగా లాకున్నా వాటిని తిరిగి వారికి ఇప్పిస్తామన్నారు.
టిడిపి - జనసేన రాబోవు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతుందని దీనిని ఎవరు అడ్డుకోలేరని పునరుద్ఘాటించారు.
అనంతరం పార్టీలో బెల్లంకొండ తిరుపతి, బత్తల అంజయ్య ఆధ్వర్యంలో చేరిన బత్తల అంజయ్య, చెన్నయ్య ,వేమాల శీనయ్య, బెల్లంకొండ తిరుపతి , ఆంజనేయులు , హనుమంతు, దేవళ్ళ.శీనయ్య ,చల్లా వెంకటేశ్వర్లు ,వేమాల రవి, బత్తల హనుమంతు, బత్తల పెద్ద హనుమంతు, యామాల శ్రీనివాసులు, సంజీవరాయుడు, దేవళ్ళ.హరిబాబు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బీ.హనుమంతు, దేవళ్ళ హరిబాబు, బత్తల. సంజీవ్, దేవళ్ళ ,వెంకటేశ్వర్లు, బెల్లంకొండ తిరుపతయ్య తదితరులను ను పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, బొద్దులూరి మల్లికార్జున్ నాయుడు ,రవీంద్రనాయుడు, కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి అక్కెం సుధాకర్ రెడ్డి, అజయ్,అడపాల.సుధాకర్ రెడ్డి, యర్రబల్లి నాయకులు మాదాల నల్లప నాయుడు, భాస్కర్ నాయుడు, ప్రసాద్ , పెంచలయ్య, కంచర్ల వెంకటేశ్వర్లు ,పెంచలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు
సత్యం, అహింస మార్గంలో భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మాగాంధీ 74వవర్ధంతి సందర్భంగా నాయుడుపేట NUDA పార్క్ నందు గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన
మాజీ పార్లమెంట్ సభ్యులు సూళ్లూరుపేట నియోజకవర్గం
, మాజీ NUDA డైరెక్టర్ గూడూరు రఘునాథ్ రెడ్డి గారు, నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి గారు
పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు అవధానం సుధీర్ గారు, పార్లమెంట్ కార్యవర్గ సభ్యులు దార్ల రాజేంద్ర గారు, పెళ్లకూరు తెలుగు యువత అధ్యక్షులు నెలవల ప్రసాద్ గారు నాయుడుపేట పట్టణ STసెల్ అధ్యక్షులు ఉదయ్ కుమార్ గారు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు రెహమాన్ గారు సిరాజ్ గారు నారాయణ గారు రవి గారు నాయుడుపేట పట్టణ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు సాయి గారు,తమ్మిన చైతన్య మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు....
కాకాణి ఇక నీ ఆటలు సాగవ్...
అధికార అండతో మా పార్టీ నాయకుల పై దాడులకు పాల్పడితే తగిన బుద్దిచెబుతాం
*దొంగలను పట్టుకోవడం మానేసిన పోలీసులు ప్రతిపక్ష పార్టీ నేతల పై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
ప్రజలకు మేలు చేయాల్సిన ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు.
అధికారులు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
అధికారులంటే మాకెంతో గౌరం ఉంది...హుందాగా వ్యహరించండి.
చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సర్వేపల్లి నియోజక వర్గంలోని పోలీసులు,అధికారులు, వై.సి.పి నాయకులు పై జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు
నెల్లూరులోని జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర
బొమ్మి సురేంద్ర కామెంట్స్...
వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంఎల్ఏ కాకాణి ప్రోధ్బలంతో సర్వేపల్లి నియోజక వర్గంలో టిడిపి నాయకులు, కార్యకర్తల పై దౌర్జన్యం మితిమీరి పోయింది.
పోలీసులు సైతం న్యాయం,ధర్మం లేకుండా వ్యవహరిస్తున్నారు. అధర్మమైన సరే... వైపిపి నాయకులను రక్షిస్తూ మా నాయకులు,కార్యకర్తల పై దాడులు,దౌర్జన్యాలు కు పాల్పడుతున్నారు.
ఇప్పటి వరకు ఓపికతో భరిం చాం...ఇక భరించే ప్రసక్తే లేదు.ఖచ్చితంగా తిరుగు బాటు చేసి తగిన గుణపాఠం చెబుతాం.
ఎంఎల్ఏ కాకాణి కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఉదేశంతో పొదలకూరులో ఎస్ఐ కరిముల్లా మా మండల పార్టీ అధ్యక్షుడు పై దాడికి పాల్పడి ఆయన సతీమణిని సైతం అసభ్యపదజాలంతో దుర్భాషలాడాడు.
ఎంఎల్ఏ కాకాణి చేసిన అసత్య ఆరోపణలను ఖండించిన మా నాయకుడు పై దౌర్జన్యానికి పాల్పడడం సిగ్గుచేటు.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వత మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పై అక్రమకేసులు బనాయించారు...
అభివృద్ది...అభివృద్ది అంటూ డప్పు కొట్టుకుంటూ...ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమి లేదు.
కాకాణికి దమ్ముంటే టిడిపి అధికారంలో ఉన్నసమయంలో మా నాయకులు సోమిరెడ్డి సహకారంతో సర్వేపల్లి నియోజక వర్గంలో జరిగిన అభివృద్ది...వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వత చేసిన అభివృద్ది లెక్కలు బయటపెట్టాలి.
ఎరువులు కొరత ఉన్నా సర్వేపల్లి నిమోజక వర్గంలో లేదంటూ ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే కాకాణి...ఆ విషయంలో తమ ప్రభుత్వంతో పాటు జిల్లాలోని మిగిలిన మంత్రులు,ఎమ్మెల్యేలను అసమర్దులుగా చూపుతున్నాడు.
ఎమ్మెల్యే కాకాణి ఆదేశాలతో గత తాసిల్దార్ స్వాతి చేసిన అవినీతి అక్రమాలను వెలికి తీశాడన్న నెపంతోనే పొదలకూరు టిడిపి నాయకుడు మస్తాన్‌బాబు పై పోలీసులతో దాడి చేయించాడు.
అప్పటి నుంచి మస్తాన్‌బాబు పై కక్ష కట్టిన ఎమ్మెల్యే కాకాణి పోలీసులను అడ్డుపెట్టుకుని మా నాయకుడు పై దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు.
సర్వేపల్లి నియోజక వర్గంలో మా నాయకుడు నాగేంద్ర ప్రసాద్‌కు సంబందించిన ఆస్తులను ధ్వంసం చేశారు.శ్రీనివాస యాదవ్ కు సంబందించిన పొలాల్లో కాలువలు తవ్వించి నష్టపరిచాడు.కోడూరులో గంగాధర్ అనే వ్యక్తి సంబందించిన రొయ్యల గుంతలను విధ్వంసం చేసి కోట్ల రూపాయలు నష్టం కలిగించాడు.
ప్రజలకు మేలు చేయాల్సిన ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు.
సర్వేపల్లి నియోజక వర్గంలో ఇప్పటి వరకు పని చేసిన ఎమ్మెల్యేలు ఎంతో హుందాతనంగా పనిచేస్తే కాకాణి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు.
పోలీసులతో పాటు ఎంఆర్ఓ...ఎంపిడిఓల నుంచి కింద స్దాయి అధికారుల వరకు ఎమ్మెల్యే కాకాణి ఆదేశాలతో చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే తగిన గుణపాఠం చెబుతాం.
అదికారులంటే మాకెంతో గౌరం ఉంది...ఎమ్మెల్యే చెప్పినట్లు ఆడటం కాకుండా ప్రజల కోసం పని చేయాలని కోరుతున్నాం.
దొంగలను...దోపిడిగాళ్ళను పట్టుకోవడం మానేసిన పోలీసులు ప్రతిపక్ష పార్టీ నేతల పై దౌర్జన్యాలకు పాల్పడడం సిగ్గు చేటు
అధికారంలో ఎవ్వరూ శాశ్వతం కాదు...అది గుర్తుంచుకుని అధికారులు వ్యవహరించాలి...
చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఇప్పటి కైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సర్వేపల్లి నియోజక వర్గంలో జరుగుతున్న అవినీతి,అక్రమాలు,దౌర్జన్యాలు,దాడులకు అడ్డుకట్ట వేయాలి.
సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు...చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసులు, వై. సి.పి నాయకులు పై ఫిర్యాదు చేసిన నియోజక…
నెల్లూరు జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ గౌరవనీయులు శ్రీ పాశం సునీల్ కుమార్ గారికి తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వారు సునీల్ కుమార్ గారు అడల్ట్ (వయోజన) ఎడ్యుకేషన్ పై పరిశోధన చేసినందుకు గాను తనకు ఎస్వీ యూనివర్సిటీ నుండి పి హెచ్ డి (డాక్టరేట్) అందుకున్న సందర్భంగా ప్రగతి సేవ సంస్ధ ఆధ్వర్యంలో సాల్వ,బోకే,పూలమాలతో సత్కరించడం జరిగింది ఇలాగే మరి ఎన్నో పదవులను అలంకరించాలని కోరుకుంటన్నాం.అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు,కార్య వర్గ సభ్యులు నెలబల్లి భాస్కర్ రెడ్డి, పి.డి.కరిముల్లా,శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు,కార్పొరేషన్ రవికుమార్,గ్రానైట్ ప్రభాకర్,వాచ్ షాప్ రాము, పిల్లిల శీను,శ్రీనివాసులు, ఆక్వా రమేష్,K.R.M,సురేష్, కోఆర్డినేటర్ C.V.R న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర సందర్భంగా నెల్లూరు నడిబొడ్డున మార్మోగిన జై అమరావతి నినాదం
పాదయాత్రకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రైతు నాయకులు, న్యాయవాదులతో పాటు సామాన్య ప్రజల నుంచి విశేష స్పందన
రాజధాని రైతులకు హారతులు పట్టిన సింహపురి ప్రజానీకం
జోరువానకూ జడవని అన్నదాతలు...బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
*పాదయాత్రలో పాల్గొని రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించిమ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు సిటీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు
మాజీ మంత్రి సోమిరెడ్డి కామెంట్స్
మూడు రాజధానుల నిర్ణయం ఆనాలోచితం..రాష్ట్రంలో సాగుతున్న ప్రజాపాలన కాదు, విధ్వంసకర పాలన
మాట తప్పను..మడమ తిప్పననే ప్రగల్భాలు పలికే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అసెంబ్లీలో అమరావతికి ఎందుకు మద్దతు పలికారు..ఈ రోజు మాట ఎందుకు తప్పారు
సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తుంటే ఎందుకు అడ్డం చెప్పలేదు
అన్ని పార్టీలతో పాటు ప్రజలు రాజధానిగా ఆమోదించిన అమరావతికి ఎందుకు కక్ష కట్టారు
పరిపాలన వికేంద్రీకరణ కాదు..చేతనైతే అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యి
మూడు రాజధానుల నిర్ణయం పిచ్చిపాలనలో భాగమే
అమరావతి ఆడపడుచుల పాదయాత్ర చూస్తుంటే ప్రతి ఒక్కరికీ కంట కన్నీరు వస్తోంది...ఇది చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం
దేవుడి ఆశీస్సులు, ఐదు కోట్ల ఆంధ్రుల మద్దతుతో కచ్చితంగా అమరావతి రాజధానిగా కొనసాగుతుంది
రైతులపై కేసులు పెట్టింది వైకాపా ప్రభుత్వం కాదా....? రైతులు క్రాప్ హాలిడే ప్రకటించింది వైకాపా ప్రభుత్వంలో కాదా....?
గతంలో జిల్లాలో ఎప్పుడూ క్రాప్ హాలిడే ప్రకటించిన దాఖలాలు లేవు....కేవలం ప్రభుత్వం పుణ్యాన జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు..
నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ రైతుబిడ్డలే.... వీరే పంటలు వేయకుండా వారి ప్రభుత్వాన్ని పొగడడం సిగ్గు లేని చర్య....
ఎదుటి వారి పై విమర్శలు చేసేటప్పుడు, అసలు రైతుల కోసం వైకాపా నాయకులు గుర్తు చేసుకోవాలి..
రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతు భరోసా కేంద్రాలు పెట్టడం హాస్యాస్పదం..
జిల్లా లో వైకాపా నాయకులు చెప్పినట్టు తెదేపా రైతులను 100% మోసం చేస్తే, వైకాపా 1000% మోసం చేస్తుంది.
రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన సంగతి మర్చిపోయి, వైకాపా నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు..
జిల్లా లో 5 లక్షల ఎకరాలు సాగు చేయడానికి నీరు ఉండి కూడా, కేవలం 1.5 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట పండించారు...
- ఒట్టూరు సంపత్ యాదవ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి
గురువారం నెల్లూరు నగరం లోని ఎన్టీఆర్ భవన్ లో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా ఒట్టూరు సంపత్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ...
ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా దాని పై రాళ్లు వేయడమే పనిగా వైకాపా ప్రభుత్వం పెట్టుకుందనీ అన్నారు..
రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రైతు కోసం తెలుగు దేశం అన్న కార్యక్రమం చేపడితే దానిపై వైకాపా నాయకులు విమర్శలు చేయటం దారుణమన్నారు..
ఈ కార్యక్రమానికి వచ్చింది రైతులు కాదు, 200 రూపాయలు ఇచ్చి తీసుకువచ్చిన జనాలనీ వైకాపా నేతలు అంటున్నారు..అసలు రైతులను అలా మాట్లాడటానికి సిగ్గు శరం, మానవత్వం లాంటివి ఏమన్నా ఈ వైసీపీ నాయకులకు ఉన్నాయా అని అన్నారు..
ఈ జిల్లాలో 5 లక్షల ఎకరాల పంట పండించడానికి సాగునీరు ఉన్నా కేవలం 1.5 లక్షల ఎకరాలలో మాత్రమే పంట పండించే పరిస్థితి జిల్లాలో ఉందనీ అన్నారు...
నీరు పుష్కలంగా ఉండి కూడా రైతులు పంటలు పండించలేని పరిస్థితిలో ఉండటాన్ని చూసి వైసిపి నాయకులు సిగ్గుపడాలి అని అన్నారు...
నెల్లూరు జిల్లాలో నీరు పుష్కలంగా ఉండి కూడా,వైకాపా రాజ్యసభ ఎంపీ గారి సొంత మండలం అల్లూరు లో ఉన్న 22వేల ఎకరాల్లో పంట పండించే పరిస్థితి లేకపోవడం సిగ్గుచేటనీ అన్నారు...
రైతులు స్వయంగా నిరసన తెలియపరుస్తూ క్రాఫ్ హాలిడే ప్రకటిస్తుంటే అది మరచిపోయి వైసిపి నాయకులు మాట్లాడుతున్నారన్నారు...
రైతులు పంటలు పండించకపోయినా మోకాల లోతు నీరు ఉన్నాయని వైకాపా నాయకులు సంకలు గుద్దుకుంటున్నారు. పంటలు పండించడానికి ఉపయోగపడనీ నీరు దేనికని మండిపడ్డారు..
కరోనా తీవ్రరూపం దాలుస్తున్న లెక్కచేయకుండా రైతులు పంటలు పండిస్తే వారికి గిట్టుబాటు ధర కల్పించడం లో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గుర్తుచేశారు...
రైతులకు గిట్టుబాటు ధర లేక వారు పండించిన పంటలను రోడ్డుపాలు చేసి నిరసన తెలియపరిస్తే, వాటిపై కూడా కేసులు పెట్టిన ఘనత వైకాపా ప్రభుత్వానిది అన్నారు...
ఈ జిల్లాలో ఉన్న ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీ రైతులను 100% మోసం చేసింది అంటున్నారని తెలుగుదేశం పార్టీ 100% మోసం చేస్తే ఈ వైకాపా ప్రభుత్వం 1000% మోసం చేస్తోందని మండిపడ్డారు...
గతంలో జిల్లాలో ఎప్పుడూ క్రాప్ హాలిడే ప్రకటించిన దాఖలాలు లేవని, కేవలం వైకాపా ప్రభుత్వం పుణ్యాన జిల్లాలో మొదటిసారిగా క్రాప్ హాలిడే ప్రకటించారనీ అన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టడం హాస్యాస్పదం అని అన్నారు..
ప్రతి నెల రైతు భరోసా కేంద్రాల్లో జరిగే సమావేశాలకు వైకాపా కు చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గానీ హాజరు కావడం లేదని అసలు వీరికి రైతులకు ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన ఉంటే కదా హాజరు కావటానికి అని హేళన చేశారు..
రైతులను పట్టించుకుని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులు పంటలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
ఎదుటి వారిపై విమర్శలు చేసేటప్పుడు ముందు అసలు మనం రైతులకు ఏం చేశామో గుర్తు చేసుకోవాలని వైకాపా నాయకులకు హితవు పలికారు...
నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ రైతుబిడ్డ లేనని, వారే పంటలు వేయకుండా ప్రభుత్వాని పొగడడానికి సిగ్గు గా లేదా అని అన్నారు...
పై కార్యక్రమం లో నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి కనపర్తి గంగాధర్, నగర ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నెల్లూరు మురళి, అనీల్, ఆనంద్, అనీం పాల్గొన్నారు....
మర్రిపాడు ఎస్సై ఘటనపై స్పందించిన జిల్లా టీడీపీ
సోమిరెడ్డి, బీద ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం
ఎస్సై వెంకటరమణ ఎందుకు చర్యలు తీసుకోవడంలో లేదో జిల్లా ఎస్పీ చెప్పాలి
ఎస్సై పై చర్యలకు ఛలో మర్రిపాడు కు పిలుపు \\ ఎస్సై వెంకట రమణ ను సస్పెండ్ చేయాలి: టిడిపి
లేకపోతే ఉద్యమాలు ఉదృతం \\ తీరు మార్చుకొనిఎస్సై వెంకట రమణ పనిచేసే ప్రతీ చోట వివాదాలు,కేసులు నమోదు\\ ఎస్సై వెంకట రమణ పై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు \\ మర్రిపాడు టీడీపీ కన్వీనర్ పై దురుసుగా ప్రవర్తించిన ఎస్సై
\\ మర్రిపాడు ముంబయి జాతీయ రహదారిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయింపు
\\ ఉదృత పరిస్థితులు నడుమ మర్రిపాడు ఈ నెల 23 న ఛలో మర్రిపాడు
ఎస్సై వెంకటరమణ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గామారుతున్నారు, 2011 లో విధుల్లో చేరిన వెంకట రమణ వెంకటగిరి, శ్రీహరికోట,కోట,నాయుడుపేట,పెళ్లకూరు, నెల్లూరు3, 5 వ పట్టణం, బిట్ర గుంట, కోవూరు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు,ఎక్కడ కూడా పట్టుమని 6 నెలలు కూడావిధులునిర్వహించలేదు, పిర్యాదు దారులు, నేతలు, ప్రముఖుల పట్ల అనుచితంగాప్రవర్తించడంకొట్టడం,అసభ్యకరంగా దూషించడంపట్లవివాదాలుచోటుచేసుకోవడంతో బాధితులు పిర్యాదులతో కేసుల్లో ఇరుకోవడం, వి ఆర్ కి వెళ్లడం పరిపాటిగా మారింది.
ఈ నేపథ్యంలో ఆయన సొంత ఊరు తుళ్ళూరులో ఓ కేసులో ఇరుక్కుని డిజిపి రేంజ్ వి ఆర్ లో ఉన్నారు, ఆ తరువాత నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో వి ఆర్ లో ఉన్న నేపథ్యంలో ఇటీవల కొద్దీ రోజుల క్రితం జిల్లా ఎస్పీ విజయరావు ఎస్సై ల బదిలీలల్లో వి ఆర్ లో ఉన్న ఎస్సైలకు పోస్టింగ్ ఇచ్చారు, అందులో భాగంగా ఎస్సై వెంకట రమణ ను మర్రిపాడు ఎస్సై గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు, విధుల్లో చేరిన ఎస్సై వెంకట రమణ సోమవారం మర్రిపాడు టీడీపీ మండల కన్వీనర్ పై అనుచితంగా ప్రవర్తించడంతో మండలం లోని టీడీపీ నేతలు, కార్యకర్తలు మర్రిపాడు ముంబయి జాతీయ రహదారిపై బైఠాయించి ఎస్సై ను సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు.
ఆందోళన ఉదృతం కావడంతో డిఎస్పీ, సి ఐ లు సంఘటన స్థలానికి చేరుకొని ఎస్సై పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు,కానీ ఎస్సై పై చర్యలు తీసుకోకపోవడంతో మంగళవారం జిల్లా టీడీపీ అధిష్టానం స్పందించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆధ్వర్యంలో నెల్లూరు నగరం లోని ఎన్టీఆర్ భవన్ లో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి , నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ అత్యవసర సమావేశం నిర్వహించారు.
మర్రిపాడు ఘటన విషయం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడుతో చర్చించారు, ఉద్యమాన్ని తీవ్రం చేయాలని నిర్ణయించి 23 వ తేదీ ఛలో మర్రిపాడు కు పిలుపునిచ్చారు,ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూమర్రిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనార్ధన్ నాయుడు, ఆయన తల్లితండ్రులను, కుటుంబ సబ్యులను సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ( గబ్బర్ సింగ్ ) నిష్కారణంగా నీచమైన భాష తో దూషించడాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు అనీ ఆగ్రహం వ్యక్తంచేశారు, మర్రిపాడు టీడీపీ కన్వీనర్ జనార్ధన్ నాయుడు పై దాడి చేసి, అతన్ని మానసికంగా ఆవేదనకు గురి చేసిన సబ్ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, సోమవారం స్థానిక ప్రజలు వందలాది మంది రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేసిన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలి అని కోరారు.
స్థానిక ప్రజలు నిరసన తెలిపినా, ఉద్యమించినా ఇప్పటి వరకు సబ్ ఇన్స్పెక్టర్ పై చర్యలు లేకపోవడం హేయమైన చర్య అన్నారు, గతంలోజిల్లా లో విధులు నిర్వర్తించిన ప్రతీ చోట వివాదాలే పని గా పెట్టుకుని, వివాదాల ఎస్సై గా పేరు గాంచిన వెంకటరమణ ( గబ్బర్ సింగ్ ) పై చర్యలు తీసుకోకపోవడాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు,ఎస్సై పైచర్యలుతీసుకోకపోవడాన్ని నిరసిస్తూ, అతని పై వెంటనేచర్యలుతీసుకోవాలని డిమాండ్ చేస్తూ చలో - మర్రిపాడుకార్యక్రమానికి జిల్లా టీడీపీ పిలుపు నివ్వడం జరిగింది అని ఆయన చెప్పారు. ఛలో మర్రిపాడు కు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా కదలి రావాలని పిలుపునిచ్చారు
బ్రిటిష్ వారికంటే ఘోరంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను కూడా హరిస్తున్న జగన్మోహన్ రెడ్డి
రమ్య హంతకులను శిక్షించాలని కోరుతూ కోవొత్తుల ర్యాలీ చేయబోతున్న తెలుగుదేశం పార్టీ నేతలను గృహానిర్బంధం చేయడం,అరెస్టులు చేయడం దారుణం
---చేజర్ల
◾◾◾◾◾◾◾◾◾◾◾
👉ఇటీవల హత్యకు గురైన రమ్య హంతకులను శిక్షించాలని కోరుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు నెల్లూరు వేదయపాలెం సెంటర్లో ఉన్న బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం వద్ద కోవొత్తుల ర్యాలీ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది
👉అయితే పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులను, అనుబంధ సంఘాల నాయకులను గృహానిర్బంధం చేయడమే కాకుండా కొంత మంది నాయకులను అరెస్టు చేయడం జరిగింది. దీనిని త్రీవరంగా ఖండిస్తునాం.
👉ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్క పౌరుడికి, ప్రతి రాజకీయ పార్టీకి ఉంది.అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రాధమిక హక్కును కూడా హరిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఉక్కుపాదం మోపుతుంది.
👉గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించివుంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసివుండేవారా!
👉దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు బ్రిటీష్ వారు వ్యవహరించిన తీరుకంటే ఘోరంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది
👉పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజా ఉద్యమాలను అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వం
👉రాష్ట్రంలో వైసీపీ పాలనలో అడబిడ్డలకు రక్షణ కరువైంది. పోలీసులను తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టులు చేయడానికి,గృహానిర్బంధం చేయడానికి వినియోగించడానికి బదులు అడబిడ్డలను వేధిస్తున్న వారిని దండించడానికి ఉపయోగిస్తే రాష్ట్రంలో రమ్య హత్య లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.
ఇట్లు
చేజర్ల వెంకటేశ్వర రెడ్డి
తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి
దళితులుపట్ల జగన్మోహన్రెడ్డి తీరు మారాలి * *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జన్ని. రమణయ్య
వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో దళితులపై అనేక దాడులు జరిగాయి,దళితుల భూములు బలవంతంగా లాక్కున్నారు, దళి
జిల్లా మహిళ అధ్యక్షురాలు పనబాక.భూలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో దళితమహిళను అత్యాచారం చేస్తే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుంది తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదని,అలాగే డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు అడిగితే అతడిని పిచ్చివాడిగా చిత్రీకరించి ఆ మానసిక క్షోభతో చనిపోయేలా చేసిందని ఈ వైకాపా అధికారంలోకి వచ్చాక దళితులకు రక్షణ కరువైందని అన్నారు.
దళితుల ఓటు బ్యాంకు తో రాజ్యాధికారం పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అదే దళితులపై ఉక్కు పాదం మోపుతున్నారని దళితులు రాబోవు ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దావా పెంచల్రావు ,జిల్లా కార్యదర్శి కనపర్తి. గంగాధర్ , తిరుపతి పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి బాబు జిల్లా ఎస్సిసెల్ ప్రధాన కార్యదర్శి ద్వారా విజయబాబు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు అరవ. కిశోర్, మాజీ కార్పొరేటర్ ప్రశాంత్,మందా రవి ,selvi,ప్రమీల ,వెంకట లక్ష్మి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు
తహసీల్దారు పక్కన ఉంటే నీ శీలం బాగైపోతుందా....కాకాణీ..
జిల్లా కలెక్టరేట్ ఆవరణలో టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి కంటేపల్లి పరిధిలో పీఓబీలో ఉన్న అటవీ భూమిలోకి తహసీల్దారును వెంట తీసుకెళ్లి శీలపరీక్ష చేసుకునే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉంది...
అసలు మీ అనుచరులే మాఫియాగా ఉంటే టీడీపీ నేతలే మైనింగ్ చేస్తున్నారని అన్నారు..వారు టీడీపీ నాయకులే అయితే ఇప్పుడే కేసు పెట్టండి..ఎందుకు పెట్టడం లేదు..
దళితుల ఇళ్లపై కరెంట్ వైర్లు పడితే ఎమ్మెల్యే ఆదేశాలతో తిరిగి ఆ బాధితులనే పోలీసు స్టేషన్ లో పెడతారా...ఇది నిజంగా అట్రాసిటీనే..
ఒకే కాంట్రాక్టరు రెండు సార్లు అక్రమంగా తవ్వకాలు చేస్తూ దొరికిపోతే ఎమ్మెల్యేగా చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిపోయి మాఫియాకు అండగా నిలవడం దుర్మార్గం..
కాంట్రాక్టర్ ను వెనకేసుకుని వస్తూ రైతులే మట్టి అమ్ముతున్నారని చెప్పడం చాలా అన్యాయమైన విషయం..
ఎమ్మెల్యేగా పోలీసు స్టేషన్ కు వెళ్లి దళితులకు అండగా నిలవాల్సిందిపోయి కాంట్రాక్టర్ కు అండగా నిలుస్తారా..ఇదెక్కడి న్యాయమో..
అటవీ శాఖకు సంబంధించిన నిషిద్ధ భూమిలో అర్థరాత్రి అక్రమంగా మట్టి తోలుకెళ్లే అధికారం మీకు ఎవరిచ్చారు.
మీ పక్కన ఉన్న తహసీల్దారుపై ప్రైవేటు కేసు వేయబోతున్నాం...
నిషిద్ధ అటవీ భూమిలో ఆయన వచ్చి అక్రమ తవ్వకాలను సమర్ధించడం విచిత్రంగా ఉంది..మరీ ఇంత బరితెగింపా
అధికారులు కూడా మాఫియాతో కలిసిపోయిన భావన కల్పిస్తున్నారు.
ఎక్కడ బడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రజలకు ద్రోహం చేస్తారా..
అన్యాయంగా వ్యవహరిస్తున్న అధికారులను ఎవరూ రక్షించలేరు...వైసీపీ నాయకులు కూడా మిమ్మల్ని కాపాడలేరు