వివాదాస్పద ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మృతి
July 09, 2020
ap died
,
Crime
,
Kadapa
,
police
,
prabhananda swamy
,
tadiptri
వివాదాస్పద ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మృతి
తాడిపత్రి
మండల పరిధిలోని చిన్నపొలమడ కేంద్రంగా త్రైత సిద్ధాంతం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పిన వివాదాస్పద ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈయన ఆత్మజ్ఞానం పేరుతో కొన్ని వందల రచనలు చేశారు. హిందూ, ముస్లిం దేవుళ్ళ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రెండేళ్ల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై, ప్రబోధానంద స్వామి శిష్యులు దాడికి పాల్పడడంతో ఈ ఆశ్రమం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేలాది మంది మంది భక్తులను సంపాదించుకున్న ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని కడప జిల్లా కొండాపురం మండల పరిధిలోని బెడుదురు కొట్టాలపల్లికి తీసుకురానున్నారు. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.