సూళ్లూరుపేట హైస్కూల్ శతాబ్ది ఉత్సవ నిర్వహక సభ్యులకు అభినందన- శ్రీసిటీ లో ఘనంగా జరిగిన సక్సెస్ మీట్
September 18, 2022
ap
,
sricity
,
tada
,
tirupati
సూళ్లూరుపేట హైస్కూల్ శతాబ్ది ఉత్సవ నిర్వహక సభ్యులకు అభినందన
- శ్రీసిటీ లో ఘనంగా జరిగిన సక్సెస్ మీట్
రవి కిరణాలు న్యూస్ తడ శ్రీసిటీ :
సూళ్లూరుపేట హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలను గత నెలలో ఘనంగా నిర్వహించి, విజయ వంతం చేసిన నిర్వాహక కమిటీ సభ్యులను ఆదివారం శ్రీసిటీకి ఆహ్వానించి, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి అభినందనలు తెలిపారు. దేశవిదేశాలలో ఉన్న పూర్వ విద్యార్థులను శతాబ్ది వేడుకలకు ఆహ్వానించి, అద్భుతంగా ఉత్సవాలను నిర్వహించినందుకు, కమిటీ సభ్యులను, పూర్వ విద్యార్ధులందరి తరఫున తాను కృతజ్ఞతాభినందనలు తెలుపుతున్నానని డా. రవీంద్ర సన్నారెడ్డి అన్నారు. ఇది తనకు ఎంతో ఉత్తేజాన్ని సంతోషాన్ని కలిగించింది అని పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రాబోవు కాలంలో మరిన్ని మంచి పనులు జరిగే విధంగా పాఠశాల అభివృద్ధికి అందరూ పని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి కమిటీ తరఫున అద్దురు శ్రీనివాసులు, ఎల్.శ్రీనివాసులు, షేక్ఉస్మాన్ బాషా, వాసుదేవన్, ఉమా మహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు, తదనంతరం శ్రీసిటీలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రత్యేకంగా తెలియచేసి ముఖ్య నిర్వాహకులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థి జమిరుద్దిన్ అకాల మృతికి సతాపం ప్రకటించారు.