*ఘనంగా నేటి దినపత్రిక సూర్య 18 వ వార్షికోత్సవ వేడుకలు*

*నెల్లూరు నగరంలోని న్యూ మిలిటరీ కాలనీలోని నేటి దినపత్రిక సూర్య జిల్లా కార్యాలయంలో సూర్య 18వ వార్షికోత్సవ వేడుకలను జిల్లా బ్రాంచ్ మేనేజర్ ఏ.రవితేజ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 18 ఏళ్ల ప్రస్థానంలో నేటి దినపత్రిక సూర్య అనేక ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొని వచ్చిందని కొనియాడారు. అలాగే అట్టడుగు వర్గాల స్వరాన్ని పాలకుల దృష్టికి తీసుకుని వెళ్లి అనేక సమస్యలను పరిష్కరించిందన్నారు. 18 ఏళ్ల ప్రస్థానంలో నేటి దినపత్రిక సూర్యను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నాగరాజు, ఉదయ్ కుమార్, సురేష్, సుమన్, కార్యాలయ ఇంఛార్జి కే. స్రవంతి  తదితరులు పాల్గొన్నారు*