బాలికల కోన్నతపాఠశాల నందు మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన చైర్మన్ శ్రీమంత్

  తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట :-

 సూళ్లూరుపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల కోన్నతపాఠశాల నందు  మధ్యాహ్న భోజనం యొక్క నాణ్యతను మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కమిషనర్ నరేంద్ర కుమార్ పరిశీలించారు .అనంతరం  స్కూల్ ఆవరణలో నందు భోజనం చేశారు. ఈసందర్భంగా మధ్యాహ్నం భజనం యాజమాన్యంతో, స్కూల్ ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ రోజూ మెను ప్రకారం పిల్లలకి మంచి భోజనం  పెట్టాలని సూచించారు. వీరివెంట సూళ్లూరుపేట మండల అగ్రికల్చర్ అడ్వైసరీ బోర్డు (AAB)చైర్మన్ దేవేంద్ర రెడ్డి వున్నారు.