రెండు రోజుల సమ్మెలో సుళ్ళూరుపేట బ్యాంక్ ఉద్యోగులు*
*రెండు రోజుల సమ్మెలో సుళ్ళూరుపేట బ్యాంక్ ఉద్యోగులు*
నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట:-
పట్టణంలో ఉన్న వివిధ బ్యాంకులు రెండు రోజులు సమ్మె భాగంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మె నిర్వహిస్తున్నట్లు ఉద్యోగులు తెలియజేశారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం కేంద్ర ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. ఈ సమ్మెకు ట్రేడ్ యూనియన్లు మరియు CITU తమ మద్దతు తెలియజేశారు.
*బ్యాంకులను ప్రవేటికరణ చేస్తే*
★ "ఖాతాలో కనీస నిల్వలు భారీగా పెరుగుతాయి"
★ "ఆన్లైన్ సేవలపై ప్రత్యేక వడ్డింపులు ఉంటాయి"
★ "రుణాలు, డిపాజిట్ల పై వడ్డీ రేట్లు భారీగా పెరుగుతాయి"
★ "ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు ఉండవు"
★ "ప్రతీ సేవకు పన్నులు ఉంటాయి"
★ "రెట్టింపు చార్జీలు ఉంటాయి"
★ "ఉచిత సేవలు ఉండవు"
★ "తక్కువ వడ్డీకి విద్యా, గృహ రుణాలు ఉండవు"
★ "మీ డిపాజిట్లకు భద్రత ఉండదు"
★ "రైతులకు రుణాలు ఉండవు"
*UFBU జిందాబాద్*
*బ్యాంక్ బచావో, దేశ్ బచావో*