నెల్లూరు నగరంలోని దర్గామిట్టలోని St. Josephs E.M. high school లోని గ్రామ,వార్డు సెక్రటేరియట్ పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం కలెక్టరు  కె.వి.ఎన్. చక్రధర్ బాబు తనిఖీ చేశారు. పరీక్ష రాస్తున్న విద్యార్ధులకు అవసరమైన వసతి సదుపాయాలు ఉన్నాయా? లేదా ? అని పరిశీలించారు. పరీక్ష రాస్తున్న విద్యార్ధులతో మాట్లాడారు. అనంతరం  రామలింగాపురం 19వ డివిజన్ లోని 19/1 వార్డ్ సెక్రటేరియట్ ని సందర్శించారు. సచివాలయంలోని సిబ్బందితో మాట్లాడి.., అర్హులైన ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ఇంటికి వెళ్లి అందించాలన్నారు. 19వ వార్డులో కోవిడ్ నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. హోం ఇసోలేషణ్ లో ఉన్నవారిని హెల్త్ సెక్రటరీ ప్రతి రోజూ పరిశీలించాలని, పాజిటివ్ వ్యక్తులు బయట తిరగకుండా చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. జిల్లాలో సచివాలయ వ్యవస్థ ఎంతో చక్కగా పనిచేస్తోందని, గ్రామాలలో, పట్టణాలలోని వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుతున్నాయన్నారు. ప్రజలు అందరూ వారికీ ఎలాంటి ప్రభుత్వ సేవలు అవసరం అయినా, అప్లికేషన్ నింపి ఆ దరఖాస్తును సచివాలయంలో ఇవ్వాలన్నారు. పింఛన్లతో పాటు ఏ విధమైన ప్రభుత్వ సేవలు అవసరం అయినా?

 వాలంటీర్లు ఇంటికే వచ్చి అందిస్తారన్నారు త్వరలోనే ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని, ఇల్లు లేని అర్హులైన నిరుపేదలు సచివాలయంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారికీ కూడా లే అవుట్ లో ప్లాట్లు ఇస్తామన్నారు. జిల్లా అధికారులు ప్రతివారం ఐదు సచివాలయాలు సందర్శించి.., ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతున్నాయో లేదో గమనించాలని అదేశించామన్నారు. 

ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ పి.సుశీల, DSO బాలకృష్ణ సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.