కరోనా వ్యాప్తి అడ్డుకునే క్రమంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
పరీక్షలు రద్దు అయినట్లు ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించాలని పక్కా ప్రణాళిక చేశామని, ఆన్‌లైన్‌లో క్లాస్‌లు చెప్పించామని, పేపర్లను తగ్గించామని, పరీక్షల కోసం అందరినీ సమన్వయం చేశామన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రద్దు చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదివరకే రెండుసార్లు పరీక్షలు వాయిదా పడగా.. జూలైలో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఎలాంటి మార్పు ఉండదని ఆయన పేర్కొన్నారు. జూలై 10 నుంచి పరీక్షలు ఉండనున్నట్లు ఆయన తెలిపారు.

పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి గతంలో మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చాయి.