రైతు పట్టభూమిలో నిర్మించిన జియో టవర్,భూమి యజమాని కి రుసుము చెల్లించకుండా రెండేళ్లుగా మొండి చేయి...

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జియో టవర్ కోసం భూమి ఇచ్చిన రైతు మీడియా మీడియాతో మాట్లాడుతూ  పాంగి రామన్న జీకే వీధి మండలం వంచుల పంచాయితీ  సిహెచ్ చెరపల్లి గ్రామం అయ్యా విషయం నా యొక్క పట్ట భూమి యందు జియో యాజమాన్యం వారు జియో టవర్ని నెలకు 8000 డబ్బులు ఇస్తామని నిర్మించడం జరిగినది. ఆ టవర్ నిర్మించి సుమారుగా రెండు సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. జియో యాజమాన్యంకు చాలాసార్లు ప్రత్యక్షంగా మేము విన్నవించడం జరిగినది అలాగే ఫోన్ ద్వారా కూడా విషయం చెప్పడం జరిగింది. ఈరోజు చేస్తాం రేపు వేస్తాం అని రోజులు గడుపుతూ ఇలా సుమారుగా రెండు సంవత్సరాలు అవుతుంది.  కానీ డబ్బులు మాత్రం వేసే పరిస్థితులు లేవు .కావున నా యొక్క గోడును మీడియా సముఖంగా జియో యాజమాన్యం  వారికి తెలిసే వరకు మీ యొక్క మీడియా ద్వారా తెలియపరుస్తారని కోరడమైనది  వారు మాకు డబ్బులు  చెల్లించని పక్షాన జియో టవర్ సేవలు మా ద్వారా నిలిపివేయడం జరుగుతుంది. కావున జియో వారికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో మీడియా ద్వారా మా యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాము ఈ వార్తకు స్పందించని యెడల తక్షణమే ఈ చర్యలు మా గ్రామం తరపున తీసుకోవడం జరుగుతుంది.అధికారులు మీడియా ప్రతినిధులు తమకు తక్షణమే న్యాయం జరిపించాలని ఆవేదన చెందారు,