కావలి డిప్యూటీ కలెక్టర్ గా
చార్జి తీసుకొన్న
ఎమ్ వీ సుధాకర్ ❗
----------------------------------------------
కావలి సబ్ కలెక్టర్ చామకూరి శ్రీధర్ IAS గత కొద్ది రోజుల క్రితం బదిలీ అయిన విషయం తెలిసిందే . ఆయన స్థానంలో ఇంకా ప్రభుత్వం ఎవరినీ అధికారికంగా భర్తీ చేయకపోయినా - ప్రభుత్వం నెల్లూరు సివిల్ సప్లై విజిలెన్సు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎమ్ వీ సుధాకర్ కు  ఫుల్ ఆడిషినల్ చార్జి ( FAC ) ఇవ్వడంతో సోమవారం రాత్రి ఆయన కావలి వచ్చి చార్జి తీసుకున్నారు .  రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలియవస్తుంది . 
సోమవారం రాత్రి సబ్ కలెక్టర్ శ్రీధర్ వద్ద నుండి సుధాకర్ చార్జి తీసుకొన్నారు .

సబ్ కలెక్టర్ గా ఉన్న శ్రీధర్ బదిలీ అయ్యిన నాటి నుండి ఎమ్ వీ సుధాకర్ ను కావలి డిప్యూటీ కలెక్టర్ గా నియమించవచ్చునన్న ఊహాగానాలు వినవస్తూనే వున్నాయి . కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి ప్రయత్నాలతోనే కావలికి సుధాకర్ వచ్చినట్లు వార్తలు వినవస్తున్నాయి . సుధాకర్ ను బదిలీ చేయించుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రతాపకుమార్ రెడ్డి - కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి , ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖరరెడ్డి ల అంగీకారం కూడా తీసుకున్నట్లు తెలిసింది .