ఆదివారం...అమావాస్య..గుమ్మడి కాయ ధర @ రూ. 1000
ఆదివారం...అమావాస్య..
గుమ్మడి కాయ ధర చూస్తే ఖంగుతినాల్సిందే..!
కొండెక్కిన అమావాస్య గుమ్మడి కాయ
గుమ్మడి కాయ ధర @ రూ. 1000
10 కేజీల గుమ్మడి కాయ ధర రూ.1000
మార్కెట్ లో భలే డిమాండ్
ఆదివారం అమావాస్య ఎంతో విశిష్టతమైనదని హిందూ పురాణాలు చెబుతున్నాయి. సంప్రదాయలు ఆచరించే క్రమంలో గుమ్మడి కాయకు భలే డిమాండ్ పెరిగింది. మార్కెట్ లో గుమ్మడి కాయలు తగినన్ని లేకపోవడంతో ఒక్కసారిగా అమావాస్య గుమ్మడి కాయ ధర కొండెక్కింది. నాయుడుపేట, గూడూరు మార్కెట్ లలో గుమ్మడి కాయ ధర రూ. 1000 పలుకుతోంది. ప్రతి 100 సంవత్సరాలకి అడి కృత్తిక ఆదివారం అమావాస్య నేపథ్యంలో హిందువులు పరమ పవిత్రంగా పూజలు చేసే ఆదివారం అమావాస్య కు ప్రాముఖ్యత సంతరించుకుంది.ఆదివారం అమావాస్య కావడంతో కుటుంబ సభ్యులు చలి నీళ్ల స్నానం ఆచరించి ముఖ ద్వారాలను పూజించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇండ్ల వద్ద, దుకాణాల వద్ద, ఆలయాల్లో అమావాస్య పూజ నేపథ్యంలో గుమ్మడి కాయ దిష్టి తీస్తూ పూజలు ఎక్కడా చూసిన దృశ్యాలు కనిపించడంతో ఆదివారం అమావాస్య విశిష్ట ప్రాధాన్యత సంతరించుకుంది.