సాధికారిత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయూతనిద్దాం బాలికా సంఘాల ఏర్పాటు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
సాధికారిత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయూతనిద్దాం బాలికా సంఘాల ఏర్పాటు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
పొదలకూరు మేజర్ న్యూస్..
బాలికలు, మహిళల ఉజ్వల్ భవిష్యత్తుకు కిశోరి వికాసం కార్యక్రమం ఎంతోగానో దోహపడుతుందని వెంకటాచలం ఐసీడీఎస్ఐ సీడీపీఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. పొదలకూరులోని ఎంపీడీఓ కార్యక్రమంలోని సమావేశ మందిరంలో మంగళవారం మండలంలోని ప్రాథమికోన్నత ,ఉన్నత పాఠశాలల హెచ్ఎం లకు ,మహిళా పోలీసులు, అంగన్ వాడీ టీచర్లు, ఏఎన్ఎం లకు కిశోరి వికాసం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సురేఖ, ఎంఈఓలు రేణుక, శోభనాద్రి, ఎంపీడీవో నరసింహారావు,వెలుగు ఏపీఎం చిన్నయ్య,డాక్టర్ కావ్యా ముఖ్య అథితులుగా హజరైమాట్లాడారు. అడపిల్లల ఉజ్వలమైన, ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు కిశోరి వికాసం కార్యక్రమం పున:ప్రారంభం పునాది వేస్తుందన్నారు. కిశోరి వికాసం పోస్టర్లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేయించారు.కిశోరి వికాసం పునఃప్రారంభం రాష్ట్రంలోని ప్రతి బాలిక భవిష్యత్తును మెరుగుపరచడానికి ఓ మంచి అవకాశమని పేర్కొన్నారు.ప్రతి బాలిక తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోగలిగేలా సమగ్రాభివృద్ధి సొంతం చేసుకొనేలా ఈ కార్యక్రమం ద్వారా చేయూతనివ్వనున్నట్టు వివరించారు.11-18 ఏళ్ల బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబనను మెరుగుపరచడం ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకు ప్రతి గ్రామంలో బాలికల సంఘాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడంతో పాటు, సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకొనేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. బాలికల్లో ఆత్మరక్షణ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం, డిజిటల్ భద్రత, సైబర్‌క్రైమ్, ఆన్లైన్ వేదికలపై జాగ్రత్తగా వుండేలా అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు.ముఖ్యంగా బాలికలు ఎదుర్కొనే ఇబ్బందులు, బాల్య వివాహాల నివారణ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బడిమానేసిన పిల్లలను బడిలో చేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ఐ సూపర్ వైజర్లు పద్మజ, జ్యోతిలక్ష్మి, నారాయణమ్మ , హెడ్ కానిస్టేబుల్ అక్తర్ బాషా, వెలుగు సీసీలు, అంగనవాడీ వర్కర్లు, ఆయాలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.