భీమునివారిపాలెం పడవలరేవును సందర్శించిన జిల్లా యస్పి
December 26, 2019
Andhrapradesh
,
Nellore
,
sp-is-the-district-that-visited-bhimunivaripalem-padavalaruvu
ఫ్లెమింగో ఫెస్టివల్ దృష్ట్యా పర్యాటకుల భద్రత అంశాలపై అధికారులతో సమీక్ష
బోటింగ్ నకు ఉపయోగించే పడవలకు ఫిట్ నెస్ సర్టిఫికేట్లు ఉండాలి
భీమునివారిపాలెం, డిసెంబర్ 26, (రవికిరణాలు) : జనవరి మొదటి వారం 3,4, 5 వ తేదీలలో జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ఉత్సవాలు సందర్భంగా జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ గురువారం సాయంత్రం భీమునివారిపాలెం పడవల రేవును సందర్శించారు.బోటు ప్రమాదాలు నివారించేందుకు గూడూరు డియస్పి, జెడి ఫిషరీస్,సూళ్ళూరుపేట ఎమ్‌ఆర్‌ఓ, టూరిజం మేనేజర్, గ్రామ సర్పంచ్ తో కలిసి ప్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా బోటింగ్ నకు ఉపయోగించే పడవల ఫిట్ నెస్ బోటు డ్రైవర్స్ లైసెన్స్ మొదలగు అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా జెడి ఫిషరీస్ పి.శ్రీహరి 10 నుండి 15 మంది కెపాసిటీ గల మొత్తం 25 బోట్లను పర్యాటకుల కోసం మరో 5 బోట్లను అత్యవసర పరిస్థితులలో భద్రత కోసం, ఇంకా గజ ఈతగాళ్ళను, లైఫ్ జాకెట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా యస్పి కి తెలపగా, అయితే అన్ని బోట్లకు ఫిట్ నెస్ సర్టిఫికేట్ లు కలిగి ఉండాలని, దానితో పాటు డ్రైవర్స్ అందరూ లైసెన్స్ పొందినవారు అయి ఉండాలని, నీటి ప్రమాదాలు నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని యస్పి ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో గూడూరు డియస్పి బి.భవాని హర్ష, జెడి ఫిషెరీస్ శ్రీహరి, ఇంచార్ట్ సిఐ సూళ్లూరుపేట వేణుగోపాల్ రెడ్డి, టూరిజం మేనేజర్ ఆమర్నాధ్ రెడ్డి, ఎమ్‌ఆర్‌ఓ నగరాజ లక్ష్మీ, ఎస్సై జ.వేణు, సర్పంచ్ రత్తయ్య ఇతర అధికారులు
పాల్గొన్నారు.