వాకాడుసౌజన్య రెడ్డిని రాష్ట్ర పచ్చదనం & సుందరీకరణ కార్పొరేషన్ డైరెక్టర్ గా శనివారం నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
నెల్లూరుజిల్లా వాకాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి మరియు వైసిపి సీనియర్ నాయకులు కొండరెడ్డి నందగోపాల్ రెడ్డి సతీమణి సౌజన్య రెడ్డిని రాష్ట్ర పచ్చదనం & సుందరీకరణ కార్పొరేషన్ డైరెక్టర్ గా శనివారం నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
కొండరెడ్డి సౌజన్య రెడ్డి రాష్ట్ర పచ్చదనం & సుందరీకరణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితుల కావడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు,కొండరెడ్డి అభిమానులు,ప్రముఖులు కొండరెడ్డి సౌజన్య రెడ్డి కి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కొండరెడ్డి సౌజన్య రెడ్డి మాట్లాడుతూ తనను రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,గూడూరుఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలుతెలియజేస్తున్నాం అన్నారు.