కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ -19 వైరస్ సోకడంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య చేసుకున్నారు. కడప జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సిరిగిరెడ్డి గంగి రెడ్డి (55) యర్రగుంట్ల సమీపంలో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రెడ్డితోపాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు కోవిడ్ -19 పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది. దీంతో వారు కొంతకాలం ఇంటి నిర్బంధంలో ఉన్నారు. శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతున్న అతను స్వయంగా ప్రొద్దుటూర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.