నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబును..., " సింగపూర్ కి చెందిన SEMBCORP Energy india ltd. సంస్థ ప్రతినిధులు కలిశారు. కోవిడ్-19 నివారణకు ప్రభుత్వానికి తమవంతుగా.., ప్రభుత్వ ఆస్పత్రులలో రక్త పరీక్షల నిర్వహణకు అవసరమైన హెమటోలజి అనాలసిస్ మిషన్స్ ని కలెక్టర్ కి అందించారు. ఒక్కో హెమటాలజీ అనాలసిస్ మిషన్ రూ. 2.8 లక్షలు ఖర్చు అవుతోందని.., సుమారు 25 లక్షల రూపాయల విలువైన 9 మిషన్స్ ని కలెక్టర్ కి అందిస్తున్నామని.., sembcorp c.s.r head డా. ప్రభాకర్ వర్మ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కోవిడ్  ఆపరేషన్స్ కి మద్దతుగా..., హెమటాలజీ మిషన్స్ ని   sembcorp సంస్థ యాజమాన్యం ప్రభుత్వానికి అందించడం  అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ఈ యూనిట్స్ అన్నింటినీ జిల్లాలో అవసరమైన ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిణీ చేస్తామన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ట్రయాజనింగ్ చేయడంలో హెమటాలజీ మిషన్స్ ఎంతో ఉపయోగపడతాయని...,
 ట్రయాజినింగ్ లో ఆలస్యం కావడం వల్ల కరోనా వ్యాధి తీవ్రమైన లక్షణాలు ఉన్న పేషెంట్స్ ను గుర్తించడంలో ఆలస్యం జరుగుతోందని.., దీనివల్ల వారిని సరైన సమయంలో ఆస్పత్రికి తరలించడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని.., హెమటాలజీ మిషన్స్ ద్వారా ఈ సమస్యను అధిగమించి.., వేగంగా ట్రయాజనింగ్ చేసి.., కోవిడ్ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని త్వరితగతిన గుర్తించి..., ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలను రక్షించవచ్చన్నారు. 
నెల్లూరు జిల్లాలోని  పారిశ్రామిక వేత్తలు,  కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి..,  సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి కోవిడ్ ఆపరేషన్స్ లో సహకరించాలని  కలెక్టర్ సూచించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని, వారి కుటుంబ సభ్యుల పట్ల వివక్ష ప్రదర్శించరాదని.., జిల్లాలో ఈ రోజు వరకూ 5,453 మంది వరకూ పాజిటివ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స తీసుకుని నెగటివ్ రిజల్ట్స్ తో ఇంటికి వెళ్లారని.., అలాంటి వారందరూ ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఒక వ్యక్తి ఇచ్చిన ప్లాస్మా దానంతో.., తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్న ఇద్దరు కోవిడ్ పాజిటివ్ బాధితులను రక్షించవచ్చన్నారు.  ప్లాస్మా దానానికి ముందుకు వచ్చిన వారికి ప్రోత్సాహకంగా ప్రభుత్వం రూ.5,000 అందిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో డి.సి.హెచ్.ఎస్. శ్రీ చెన్నయ్య, sembcorp సంస్థ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

*----------------------------------------*

*ఉప సంచాలకులు, సమాచార, పౌర సంబంధాల శాఖ, నెల్లూరు జిల్లా వారిచే జారీచేయడమైనది.*