*రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తులకు చీరలు ధోవతులు  పంపిణీ చేసిన  మంత్రి శ్రీమతి రోజా సెల్వమణి  దంపతులు.* 
*************************************************************
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు  క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా శ్రీ సెల్వమణి  దంపతులు శ్రీ దేశమ్మతల్లి మరియు శ్రీ ఓరుకుంటాలమ్మ తల్లి భక్తులకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చీరలు, ధోవతులు శుక్రవారం  పంపిణి చేశారు.  

నగరి లోని జరుగుతున్న గంగమ్మ జాతర సందర్భంగా  *గ్రామ దేవతలు శ్రీ దేశమ్మ తల్లి మరియు శ్రీ ఓరి గుంటలమ్మ తల్లి విశేష పూజలలో* పాల్గొని రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి,  గ్రామ మహిళలులకి  1,400 మందికి చీరలు, ధోవతులు అంధ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు మాట్లాడుతూ నగరి నియోజకవర్గ ప్రజలందరు  సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున  మన ముఖ్యమంత్రి గారికి నగరి లో జాతర ప్రాముఖ్యతను తెలిపి ప్రత్యేక  అనుమతి తీసుకొని, మీ ఇంటి ఆడపడుచుగా  హాజరైనట్లు తెలిపారు. నియోజకవర్గ ఆడపడుచులు అందరికి చీర సారె  పెట్టేందుకు వచ్చినట్లు తెలిపారు.   

ఈ సమావేశంలో మున్సిపల్ చెర్మన్, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు సభ్యులు, ప్రజా ప్రతినిధులు మరియు  వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.