ఏ.ఆర్.డి. స్వచ్ఛంద సేవా సంస్థ ,యాక్షన్ ఎయిడ్ అసోసియేషన్ సంయుక్త  సహకారంతో ఆర్.వి. దియా ట్రస్ట్  ఆర్థిక సహాయంతో కోట, చిల్లకూరు, సైదాపురం మరియు గూడూరు మండలం లోని 15 గ్రామాల్లోని ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, బాలింతలు మరియు గర్భవతులైన 820 కుటుంబాల వారికి పౌష్టికాహార కిట్లను అందజేయడంతో పాటు పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు 840 మంది పిల్లలకు అందజేయడం జరిగింది. ఏ.ఆర్.డి. సంస్థ డైరెక్టర్ షేక్.బషీర్ గారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వారికి పౌష్టికాహారం అందజేస్తే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని, అలాగే ఈ కుటుంబాల పిల్లల చదువును ప్రోత్సహించడంలో భాగంగా స్కూలు బ్యాగులను అందజేయడం జరిగిందని తెలియజేశారు.
అలాగే మన పరిసరాల్లో లభించే పండ్లు కూరగాయలను ఆహారంగా తీసుకుని మంచి ఆరోగ్యం కలిగి ఉండి మన పిల్లలను బడికి పంపించి బాగా చదివించాలని తెలిపారు.
ఈ కార్యక్రమములో ఏ.అర్. డి. డైరక్టర్ షేక్.బషీర్ మరియు సిబ్బంది, సిద్దవరం గ్రామ అంగన్వాడీ సిబ్బంది, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తలిదండ్రుల కమిటీ అధ్యక్షురలు పాల్గొన్నారు