సూళ్లూరుపేట లో ఘనంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జన్మదిన వేడుకలు.

తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట:-

పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద  జి.యం.అర్  మిత్ర బృందం అధ్వర్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జన్మదిన వేడుకలను సూళ్లూరుపేటకు చెందిన సత్యకుమార్ స్నేహితులు ఘనంగా నిర్వహించారు.
ముందుగా అక్కడేవున్న డా"బి.అర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. తర్వాత 200 మంది పేద ప్రజలకు అన్న దానం చేశారు. అక్కడ నుండి బయలుదేరి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కి చేరుకొని అక్కడ వున్న డాక్టర్ సమక్షంలో 50 రోగులకు పండ్లు, బిస్కెట్లు,బ్రెడ్ ప్యాకెట్లు పంచి పెట్టారు. అనంతరం సత్యకుమార్ స్నేహితుడు అంబూరు చెంచు కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ మేమంతా  జి.యం.అర్ పాలిటెక్నిక్ కళాశాల మదన పల్లిలో చదివేటప్పుడు సత్యన్న మమ్మలను ఎంతో ఆదరించేవారని విద్యార్థి దశ నుంచే అంచలంచలుగా ఎదిగి నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దగ్గర వ్యకి గత కార్యదర్శిగా, ఎస్టీ ఓగా పనిచేసి  ఇప్పుడు కేరళ, ఉత్తప్రదేశ్ మరియు అండమాన్ నికోబార్ దీవులు రాష్ట్రాలకి ఎన్నికల కమిషన్ గా వున్నారని అన్నారు. ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా ఇంకా మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో అంబూరు.చంద్రయ్య,బి.వి. కృష్ణయ్య, సి.రాజ, టి. నారాయణ,బి.కోటి, డి. బ్రహ్మయ్య, డి.గోపాల్, డి.రమేష్ తదతరులు వున్నారు.