మంత్రి కాకాణి ఈసారి గెలిస్తే సర్వేపల్లిని అమ్మేస్తాడు
మంత్రి కాకాణి ఈసారి గెలిస్తే సర్వేపల్లిని అమ్మేస్తాడు
జనసేన - టిడిపి ప్రభంజనం సృష్టించబోతుంది
2024లో టిడిపి అధికారంలోకి రావడాన్ని ఎవ్వరూ ఆపలేరు
నేదురుపల్లి పంచాయతీ యర్రబల్లి గ్రామంలో 20 కుటుంబాలు టిడిపిలో చేరిక
మంత్రి కాకాణి ఈసారి ఎన్నికల్లో గెలిస్తే నడిరోడ్డులో సర్వేపల్లిని అమ్మేస్తాడని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు ,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
సోమవారం మండలంలోని నేదురుపల్లి పంచాయితీలోని యర్రబల్లి గ్రామంలో బాబు షూరిటీ - భవిషత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న సోమిరెడ్డి.
ఇంటింటికి కరపత్రాలు పంచి ,ప్రజలతో మమేకమై అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సోమిరెడ్డి
సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టిన యర్రబల్లి గ్రామస్తులు
యర్రబల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు వై.సి.పి నీ వీడి టిడిపి పార్టీలో చేరారు.
వారికి సోమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు పెరిగాయన్నారు
సర్వేపల్లి లో ఇది ఇంకా ఎక్కువగా ఉందన్నారు. వైసీపీ నాయకులు ప్రకృతి సంపదలను కొల్లగొట్టి కోట్ల రూపాయలను దోచుకొని దాచుకుంటున్నారన్నారు. తనకి గత రెండు ఎన్నికల్లో మెజారిటీ తగ్గిన అభివృద్ధి చేశామన్నారు.
కానీ మంత్రి కాకాణి దగ్గరకు ఇటీవల తోటపల్లి గూడూరు గ్రామస్తులు వెళితే మీ మండలంలో నాకు మెజారిటీ తగ్గిందని మీకెందుకు చేయాలని ప్రశ్నించారన్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ను మూసేశారన్నారు.
టీడీపీ ప్రభుత్వం వర్క్ ఆర్డర్ ఇచ్చి మొదలు పెట్టిన పనులను కూడా అధికారంలోకి రాగానే 25% లోపల పనులు జరిగిన వాటిని వైసీపీ ప్రభుత్వం ఆపేసిందన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రిగా వుండి మండలంలో మొదటి పంటకే 12 వేల ఎకరాల భూమిని బీడు పెట్టించిన ఘనత మంత్రి కాకానికే దక్కిందన్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు కండలేరు లో 8 టీఎంసీలు నీరు ఉన్నప్పుడే రైతులకు నీరు ఇచ్చామన్నారు.
రెండు రోజుల కిందట మరో రెండు రోజుల్లో నీరు ఇవ్వకుంటే నిరాహార దీక్ష చేస్తామన్న టిడిపి నాయకులు, తాము పోరాడితే ఆదివారం ఎడమ కాలువకు నీరు వదిలారు అన్నారు.
సోమశిల ఆఫ్రాన్, సర్వేపల్లి చెరువు టెండర్ పనులు మధ్యలోనే ఆపేసిన ఆ పనులు పూర్తిచేసే దిక్కు లేదన్నారు.
సోమశిల అఫ్రన్ పూర్తి కాకుంటే ఏ క్షణమైనా ప్రమాదం జరగవచ్చునన్నారు.
సర్వేపల్లి భూ పంపిణీలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ,బినామీ పేర్లతో పొలాలను వైసిపి నాయకులు దోచుకుంటున్నారన్నారు.
ఒక బత్తులపల్లి వీఆర్ఏనే 14 ఎకరాలు వారి కుటుంబ సభ్యుల పేరుతో రాసుకున్నారని దీనిపై కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశామన్నారు.
టిడిపిలో అధికారంలోకి రాగానే నిజమైన రైతుల భూమును ఈ ప్రభుత్వ పెద్దలు,అధికారులు అక్రమంగా లాకున్నా వాటిని తిరిగి వారికి ఇప్పిస్తామన్నారు.
టిడిపి - జనసేన రాబోవు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతుందని దీనిని ఎవరు అడ్డుకోలేరని పునరుద్ఘాటించారు.
అనంతరం పార్టీలో బెల్లంకొండ తిరుపతి, బత్తల అంజయ్య ఆధ్వర్యంలో చేరిన బత్తల అంజయ్య, చెన్నయ్య ,వేమాల శీనయ్య, బెల్లంకొండ తిరుపతి , ఆంజనేయులు , హనుమంతు, దేవళ్ళ.శీనయ్య ,చల్లా వెంకటేశ్వర్లు ,వేమాల రవి, బత్తల హనుమంతు, బత్తల పెద్ద హనుమంతు, యామాల శ్రీనివాసులు, సంజీవరాయుడు, దేవళ్ళ.హరిబాబు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బీ.హనుమంతు, దేవళ్ళ హరిబాబు, బత్తల. సంజీవ్, దేవళ్ళ ,వెంకటేశ్వర్లు, బెల్లంకొండ తిరుపతయ్య తదితరులను ను పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, బొద్దులూరి మల్లికార్జున్ నాయుడు ,రవీంద్రనాయుడు, కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి అక్కెం సుధాకర్ రెడ్డి, అజయ్,అడపాల.సుధాకర్ రెడ్డి, యర్రబల్లి నాయకులు మాదాల నల్లప నాయుడు, భాస్కర్ నాయుడు, ప్రసాద్ , పెంచలయ్య, కంచర్ల వెంకటేశ్వర్లు ,పెంచలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు