*నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కసుమూరు గ్రామంలో పర్యటించి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసి, వైయస్సార్ చేయూత ద్వారా లబ్ది పొందిన సంఘబంధం సభ్యురాలు అభివృద్ధి చేసుకున్న షాపులను ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.* 

*వైయస్సార్ చేయూత రూ.17,500/-లు, బ్యాంకు రుణం రూ.56,250/-లతో కలిపి రూ.75,000/-ల నగదును లబ్దిదారులైన సంఘబంధ సభ్యురాళ్లకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.*

*కసుమూరు గ్రామంలో పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించి, బాలింతలకు వైయస్సార్ ఆరోగ్య కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.*

*వర్షాలతో పనులు లేక ఇబ్బందులు పడుతున్న చల్లా యానాదులకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.*

*స్క్రోలింగ్ పాయింట్స్:*

👉రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందటంతో పాటు, గ్రామాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది.

👉గతంలో మహానేత రాజశేఖర్ రెడ్డి గారి తరువాత ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.

👉జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నారు.

👉నాడు-నేడు ద్వారా పాఠశాలలను, ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తూ వాటి రూపురేఖలను మారుస్తున్నారు.

👉ఆరోగ్య శ్రీ పధకం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్యభద్రత కల్పిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.

👉తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల సమస్యలను, గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.

👉మీ అందరి ఆశీస్సులతో రెండవసారి ఎమ్మెల్యే గా గెలిచి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఒక్క గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించి, అభివృద్ధి పనులు చేస్తున్నాము.

👉తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చాలా సంవత్సరాలు రాష్టాన్ని పాలించినా, రాజకీయాలు తప్ప, ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించలేదు.

👉జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే, తట్టుకోలేక తెలుగుదేశం వాళ్ళు అనవసర విమర్శలు చేస్తున్నారు.

👉గ్రామాల్లో  ప్రజలు ఆశించిన విధంగా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది.

👉పేదవారికి ఇళ్ల పట్టాల పంపిణీని చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు కోర్టుల ద్వారా అడ్డుకునే పరిస్థితి.

👉ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించి తీరుతాము.

👉మహిళలకు వైయస్సార్ చేయూత ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

👉ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి.