ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా ...
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ వర్కర్స్ తమ హక్కుల సాధనలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సచివాలయాల పేరుతో తమ శానిటేషన్ కార్మికులపై పై అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారని, తమను యథాప్రకారం మున్సిపల్ కార్యాలయానికి కేటాయించి తద్వారా శానిటేషన్ పనులు నిర్వహించాలని కోరారు,అలాగే తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి అర్హులైన ప్రతి ఒక్కరికి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రాన్ని మున్సిపల్ కార్యాలయంలో సమర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు హజరత్తయ్య ,నాగరాజు మునీర్ బాబు తదితరులు పాల్గొన్నారు