దేశంలో కరోనా: జులై చివరికి 10 లక్షల కేసులు.. ఒక్క ఢిల్లీలోనే 5.5 లక్షలు!

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతుండగా.. జులై చివరినాటికి ఈ సంఖ్య 10 లక్షలకు చేరుకుంటుందని ఓ అధ్యయనం అంచనా వేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి
కరోనా వైరస్ వ్యాప్తి

జులై చివరి నాటికి దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 8-10 లక్షలకు చేరొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అలాగే, ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో సామాజిక వ్యాప్తి మొదలైనట్టు అభిప్రాయపడ్డారు. ‘‘మేము ఎంచుకున్న గణిత నమూనా ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి ఇంకా పెరగనుంది. అందుకే ఢిల్లీలో జులై చివరికి 5.5 లక్షల కేసులు ఉండొచన్న విషయం ఆశ్చర్యం కలిగించలేదు. అక్కడి జనాభాను, ఇప్పటికే నమోదైన 30 వేల కేసులను బట్టి చూస్తే సామాజిక సంక్రమణం ఎప్పుడో మొదలైనట్లే’ అని సమిత్‌ భట్టాచార్య అనే శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు.