రైతులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వం.... జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి
రైతులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వం.... జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి....జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధర అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తగిన మార్గదర్శకాలను విడుదల చేసిందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. నెల్లూరు వేదాయపాలెం జిల్లా పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయంలో రెండో రోజు డయల్ యువర్ జాయింట్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరింత గడువు కూడా వచ్చిందన్నారు...జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు... జిల్లాలో ప్రతి రైతుకు న్యాయం చేయాలన్న ధ్యేయంతో తాము పని చేస్తున్నామన్నారు...ఈ సందర్భంగా కోవూరు డెల్టా ప్రాంతానికి సంబంధించి పలువురు రైతులు జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేసి ధాన్యం కొనుగోలు చేయడంలో చిన్నపాటి ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మరికొంత మంది మద్దతు ధర వచ్చేలా కృషి చేసిన జేసీకి కృతజ్ఞతలు తెలిపారు.