రోడ్డు ప్రమాదంలో హీరో సాయి ధరమ్ తేజ్ కు గాయాలు అపోలో ఆస్పత్రిలో చికిత్స

 హైదరాబాద్‌లో ప్రముఖ టాలీవుడ్‌ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీ హిల్స్‌ రోడ్డు నంబర్‌-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా అతను ఈ ప్రమాదానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న ధరమ్‌ తేజ్‌ను మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. కుడి కన్నుపై, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయినట్లు డాక్టర్లు తెలిపారు.


హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన వైద్యులు :-

సాయిధర్‌మ్‌ తేజ్‌కు ప్రాణాపాయం లేదని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితిపై అపోలో వైద్యులు అర్ధరాత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. సాయిధరమ్‌ తేజ్‌ కాలర్‌ బోన్‌ విరిగిందని.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు.