ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో విఆర్సి సెంటర్ లో కల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల
December 14, 2020
ap
,
cpm
,
dharna
,
farmers
,
Nellore
,
rytu sangam
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో విఆర్సి సెంటర్ లో కల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రదర్శనగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయం కార్యాలయం నిరసన తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రైతాంగం దివాళా తీసే విధంగా ఉన్న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి . ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమం విజయవంతం చేసేందుకు 14 సోమవారం నెల్లూరులో బీ యెస్ ఎన్ ఎల్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన లో ఆయన పాల్గొని మాట్లాడారు .రైతులు తాము పండించిన పంటలు ఎక్కడైనా లాభసాటిగా అమ్ముకొనేలా చట్టం తెచ్చామని చెప్తున్న మోడీ గారు సాధారణ రైతు తమ పంట అమ్ముకొనేలా ,తగిన వసతి ట్రాన్స్పోర్ట్ చేయకుండా పండించిన పంటకు మద్దతు ధర గ్యారంటీ చేస్తూ పార్లమెంట్లో చట్టం తేకుండా ఎలా రైతు అమ్ముకోగలడో మోడీ చెప్పటంలేదన్నాడు .నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్ లోకి పోయేలా 1955 నిత్యావసర చట్టాలను ఎత్తి వేశారని అన్నారు .చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన కొంసాగిస్తామని చెప్పారు