*నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు-రూరల్ ఎస్ఐ బ్రహ్మనాయుడు
*నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు
-రూరల్ ఎస్ఐ బ్రహ్మనాయుడు
గూడూరు రూరల్:నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎస్ఐ బ్రహ్మనాయుడు వాహనదారులను హెచ్చరించారు. గూడూరు పోటుపాలెం జాతీయ రహదారి వద్ద సరైన పత్రాలు లేని వాహనాలను హెల్మెట్లు మాస్కులు ధరించి కుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి చలానాలు విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వాహనదారులకు రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలను ఉల్లంఘించిన వారికి చలానాలు విధించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు వహదారులు సరైన పత్రాలను వారి వద్ద ఉంచుకోవాలని దీనితోపాటు తప్పనిసరిగా హెల్మెట్ మాస్కులు ధరించాలి అని త్రిబుల్ రైడింగ్,మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి చేయకూడదని,కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.తరచుగా నిబంధనలను ఉల్లంఘించి వాహనాలను నడిపే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈయన వెంట సిబ్బంది తదితరులు ఉన్నారు.