04.08.2020 న
గొలగమూడి రోడ్డులో గల ఫిట్నెస్ టెస్టింగ్ సెంటరును సందర్శించిన సందర్భముగా, కరోన (COVID-19) నివారణలో భాగంగా నెల్లూరు జిల్లా, రవాణా శాఖ అధ్వర్యంలో, గౌ. రవాణా కమిషనరు, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారి చే పంపబడిన కరోన (COVID-19) డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్లను, సరకు రవాణా వాహనముల డ్రైవర్లకు మరియు ఆటో రిక్షా డ్రైవర్లకు, ఉప రవాణా కమిషనరు, శ్రీ Ch.V.K. సుబ్బా రావు గారు అందజేశారు. ఈ యొక్క కిట్ నందు 4 మాస్క్ లు, 2 సబ్బులు, 1 సానిటైజర్ మరియు కరోన (COVID-19) బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయకూడని/చేయవసిన పనులు మొదలగు వివరాలను తెలియచేసే పాంఫ్లేట్లు కలిగి ఉన్నవి. ఆటోరిక్షాలో డ్రైవర్‌తో సహా ముగ్గురు మాత్రమే ఉండవలెనని అంతకుమించి ఎక్కించు కొనరాదని సూచించారు.
ఈ సందర్భంగా ఉప రవాణా కమిషనరు, శ్రీ Ch. V.K. సుబ్బా రావు గారు మాట్లాడుతూ కరోన (COVID-19) పరిస్థితుల దృష్ట్యా, రవాణా వాహన యజమానులు ది. 30.06.2020 మరియు 30.09.2020 నాటికి అంతమగు త్రైమాసికములకు కట్టవలసిన త్రైమాసిక పన్ను ను ది. 30.09.2020 లోగా ఎటువంటి పెనాల్టీ లేకుండా చెల్లించ వచ్చునని తెలియ చేసారు. అంతే కాకుండా ఒక త్రైమాసికము కట్టిన తరువాత మరొక త్రైమాసికమునకు లేదా ఒకేసారి రెండు త్రైమాసికములకు పన్ను చెల్లించే వీలు కల్పి౦చడమైనదని కూడా తెలియ చేసారు
ఈ కార్యక్రమము నందు మోటార్ వాహన తనిఖి అధికారులు శ్రీ M. సునీల్, శ్రీ A. మాధవ రావులు పాల్గొన్నారు.