*❇️వీడ్కోలు సభకు హాజరైన జిల్లా కలెక్టర్ ,జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్* 

 *❇️సబ్ కలెక్టర్ దంపతులకు సన్మానం  చేసిన జిల్లా కలెక్టర్* 

❇️ *ఆత్మీయులు, అధికారులు మధ్య ఘనంగా సబ్ కలెక్టర్ గోపాలకృష్ణకు ఆత్మీయ వీడ్కోలు* 

 *❇️  సబ్ కలెక్టర్ సేవలను కొనియాడిన అధికార యంత్రాంగం* 
 సబ్ కలెక్టర్    రొనంకి గోపాలకృష్ణ  వీధి నిర్వాహణలో నిజాయితీగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకున్నారు అని జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు,గూడూరు సబ్ కలెక్టర్ రొనంకి గోపాలకృష్ణ   పాడేరు ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి బదిలీ అయినా విషయం అందరికి తెలిసిన విషయమే, అయితే శుక్రవారం సబ్ కలెక్టర్ రొనంకి గోపాలకృష్ణ కు గూడూరు డి ఎన్ ఆర్* *కమ్యూనిటీ హాల్ నందు ఘనంగా  ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు.* 

 *ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా  జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు హాజరై సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ  దంపతులను పలకరించి పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.  డీఎన్ ఆర్ కమ్యూనిటీ హాల్లో సబ్ కలెక్టర్ జరిగిన వీడ్కోలు సభలో జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హాజరై మాట్లాడుతూ గూడూరు సబ్ కలెక్టర్ గా గోపాలకృష్ణ భాద్యతలు చేపట్టి 20 నెలల్లో డివిజన్లోని ప్రజల సమస్యలు పరిష్కరించి సేవలందించారని కొనియాడారు.*

 *రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న లే అవుట్ ఏర్పాటు చేయడంలో  జిల్లాలోనే 9 అంకణాల్లో ఏర్పాటు చేసి ఎక్కడా లేనివిదంగా గూడూరు పట్టణ ప్రజలకు గాంధీ నగర్లో 5000మంది లబ్దిదారులందరికీ పట్టాలందించారన్నారు.కరోనా సమయంలో సమర్థవంతంగా పనిచేసారన్నారు. బదిలీపై వెళుతున్న ఐటీడీఏ శాఖలో సమర్థవంతంగా పనిచేస్తారని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.*

 *సబ్ కలెక్టర్ మాట్లాడుతూ తన విధి నిర్వహణలో అన్నీ విధాల  సహకారాలు  అందించిన  జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూశాఖ అధికారులు ,సిబ్బంది, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది కి ధన్యవాదాలు తెలియజెస్తున్నాం అన్నారు,అనంతరం సబ్ కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కావలి, నాయుడుపేట,ఆత్మకూరు డివిజన్ల ఆర్డీ ఓలు,గూడూరు డివిజన్లోని అన్ని మండలాల రెవిన్యూఅధికారులు,సిబ్బంది,గూడూరు మున్సిపల్ ప్రత్యేక అధికారి మణికుమార్ డాక్టర్ జనార్దన్ రెడ్డి,డాక్టర్ రోహిణీమ్మ తదితరులు పాల్గొన్నారు.*