పేకాట కేంద్రంపై సేబ్ దాడులు. నలుగురు జూదదారులు అరెస్ట్ నలుగురు పరార్.
పేకాట కేంద్రంపై సేబ్ దాడులు.
నలుగురు జూదదారులు అరెస్ట్ నలుగురు పరార్.
2 బైకులు, 4 సెల్ ఫోన్లు, 57.510, నగదు స్వాధీనం.
నాయుడుపేట సెబ్ సిఐ అబ్దుల్ జలీల్.
పెళ్లకూరు మండలం శిరసనంబేడు విలేజ్ కానూరు ఎస్సీ కాలనీ వద్ద అడవి ప్రాంతాల్లో జూదం ఆడుతున్నారని వచ్చిన సమాచారంతో సెబ్ పోలీసులు సీఐ అబ్దుల్ జలీల్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని పేకాట కేంద్రంపై దాడి చేసి అక్కడ పేకాట ఆడుతున్న 4 జోధా దారులను అదుపులోకి తీసుకొని 4 పరారు కాగా వారి వద్ద నుండి 4 సెల్ఫోన్లను 57,510 నగదును 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. సెభ్ జాయింట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు సీఐ అబ్దుల్ జలీల్ తన సిబ్బందితో ఆదివారం తెల్లవారుజామున పేకాట కేంద్రాలపై దాడి చేసి తనిఖీలు నిర్వహించగా అక్కడ జూదం ఆడుతున్న 4 మంది పేకాటరాయుళ్ల పట్టుబడ్డారు. వాళ్ళ పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు సీఐ అబ్దుల్ జలీల్ తెలియజేశారు ఈ దాడుల్లో అధికారులు ఎస్సై శేషమ్మ వారి సిబ్బంది ఉన్నారు..