వెంకటగిరి పోలేరమ్మను దర్శించిన శ్రీసిటీ ఎండి రవి సన్నా రెడ్డి.

తిరుపతి జిల్లా. తడ:-

జిల్లాలోని వెంకటగిరి పోలేరమ్మ జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారిని శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి దర్శించి పూజలు చేశారు. ఆలయ అధికారులు మరియు కమిటీ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేతులు మీదుగా ఆలయ మర్యాదలు జరిపించారు. అమ్మవారి దర్శనానంతరం రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, పోలేరమ్మ తల్లి  కరుణాకటాక్షాలతో జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు చెప్పారు. అనంతరం ఆయన ఎస్వీబీసీ చైర్మన్ మరియు వెంకటగిరి రాజా  కుమారులు  డా. వి.బి.సాయి కృష్ణ యాచేంద్రని కలిశారు.