జగన్ సర్కార్ ఏపీ ప్రజలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కరెంటు బిల్లుకు రేషన్ కు ముడి పెట్టింది. ఇక పై 200 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు వినియోగిస్తే వారికి రేషన్ కట్ అలాగే 300 యూనిట్లు దాటితే పెన్షన్ కట్. ఇదేం వింత నిర్ణయం అని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అసలైన లభ్డిదారులను గుర్తించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది.
జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో భారీగా రేషన్ కార్డులు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. ఒకటి అంతకన్నా ఎక్కువ ఇళ్ళు కలిగిన వారు, తమ పేరు మీద ఇళ్ళు కలిగి ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఉంటున్నవారు ఈ కరెంటు షాక్ కు బలవ్వాల్సిందే. ఇక మీ ఇంటిని అద్దెకి ఇస్తే, అద్దెకు ఉండేవారు ఎక్కువ కరెంటును వినియోగించినా మీ రేషన్ కు కత్తెర పడనుంది. ఇక 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటును వినియోగిస్తే మీకు వచ్చే పింఛన్ ఆగిపోనుంది.
ఆహార భద్రత నియమాల్లో సవరణ అంటూ కొత్త మెలికలు పెట్టింది ఏపీ ప్రభుత్వం ధీంట్లో భాగంగా టాక్సీ, ఆటో, ట్రాక్టర్ తప్ప నాలుగు చక్రాల వాహనం ఉన్న వారికీ రేషన్ కార్డును కట్ చేయనున్నారు అధికారులు. ఈ కొత్త నిర్ణయం గురించి ఇప్పటికే గ్రామ వాలంటీర్లకు సమాచారం అందించారు. ప్రతీ నెల కరెంటు బిల్లు పై ఓ కన్నేయనున్నారు గ్రామ వాలంటీర్లు. జగన్ సర్కార్ విచ్చలవిడిగా తెస్తున్న సంక్షేమ పథకాలకు డబ్బు భారీగా కావలసిన పరిస్థితి ఏర్పడడంతో, తమ సంక్షేమ పథకాల అమలుకు సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్నారంటూ విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. వైసీపీ నేతలు మాత్రం సంక్షేమ ఫలాలు అసలైన అర్హులకు దక్కాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని చెప్తున్నారు. ఏదిఏమైనా జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుడికి చేదు వార్తే.