*రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు..*
🕋🕋ముస్లిం మైనారిటీ నాయకులను వారి ఇళ్లకు వెళ్లి 🕋🕋ఈద్ ముబారక్ తెలిపారు..
1. ముస్లిం సోదరులతో దువా పాల్గొన్న ఎమ్మెల్యే..2. ముస్లిం వాడల్లో ముస్లిం కుటుంబాలకు ఈద్ ముబారక్ చెబుతున్న ఎమ్మెల్యే..
*గూడూరు:* పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ మగ్ధూమ్ మొహిద్దీన్, నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ గఫుర్, నాయకులు అజీజ్ ఖాన్,జీనత్ ల ఇళ్లకు వెళ్లి రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేసిన గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు అనంతరం ముస్లిం వాడల్లోని ముస్లిం కుటుంబాలకు ఈద్ ముబారక్ తెలిపారు. అలాగే గూడూరు జామియా మసీదు నందు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అంతా మంచి జరగాలని, కరోనా మహమ్మారి అంతం అవ్వాలని ముస్లిం సోదరులతో కలసి దువా లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కు మొదటి నుండి అండగా ఉన్న ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రంజాన్ పండుగ సందర్భంగా ప్రజా సేవకుడు మా వైసీపీ రాష్ట్ర నాయకులు మగ్ధూమ్,నాయకులు గఫుర్,అజీజ్ ఖాన్,జీనత్ ల ఇళ్లకు వెళ్లి ఈద్ ముబారక్ చెప్పడం జరిగిందని మా ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అలాగే ముస్లిం సోదరులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా వచ్చి నన్ను సంప్రదించ వలసిందిగా కోరారు. అనంతరం నాయీ బ్రాహ్మణుల సమస్య పై స్పందించి అప్పటి కప్పుడే పరిష్కారం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మగ్ధుమ్, నియోజకవర్గ అధ్యక్షుడు గఫుర్,అజీజ్ ఖాన్,జీనత్,అలీం ఖాన్,నజీమ్,నాయకులు సతీష్ రెడ్డి, సురేష్,నరసయ్య,ముర్తుజ తదితరులు పాల్గొన్నారు.