అమరావతిలో కావలి సమస్యలు గురించి మంత్రులు తో చర్చించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి
విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఇండస్ట్రీస్ మరియు ఐటీ శాఖ మాత్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని, విద్యా శాఖ మాత్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారిని, మరియు గృహ నిర్మాణ శాఖ మార్చి లు శ్రీ చదలవాడ శ్రీ రంగనాధ రాజు గారిని కలిసి కావలి నియోజకవర్గం సంబంధించిన ఈ క్రింది సమస్యలను వారి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించ వలసిందిగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కోరారు
1. దామవరం నందు విమానాశ్రయం ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా
2. దగదర్తి వద్దగల ఎస్.ఇ.జెడ్ నందు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయవలసిందిగా(industries)
3. బోగోలు మండలం టెంకాయ చెట్ల పాలెం వద్ద మూసివేసిన స్కూల్ రీ ఓపెన్ చేయవలసిందిగా(education)
4. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ముసునూరు లో నిర్మించిన ఇందిరమ్మ కాలనీ లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా(housing)
సంబంధిత మంత్రివర్యులు ను ఎమ్మెల్యే గారు కోరారు