[20:09, 8/5/2020] Bose Journalist: అపూర్వంగా శ్రీ రామ జన్మభూమి లో మందిర నిర్మాణానికి శంకు స్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..

హిందువులు ఎన్నో దశాబ్దాలుగా వేచిన అపూర్వ ఘట్టం నేడు ఆవిష్కృతం అయ్యింది..

శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన చారిత్రక, పురాణ పుణ్య భూమి దివ్య కాంతులతో వెల్లి విరుస్తోంది. అయోధ్య లో శ్రీరాముడి దివ్యాలయానికి భూమి పూజ జరిగింది.

ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ వెండి ఇటుక తో పునాది రాయి వేసారు.

మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకన్ల దాకా.. అంటే 32 సెకన్ల లోపు ఈ కార్యక్రమం నిర్వహించారు.

అయోధ్యా శ్రీరామ మందిర నిర్మాణం పై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది.

సామాన్య‌లు, సెల‌బ్రిటీ లు కూడా ఇదొక అద్భుత క్ష‌ణం అని కొనియాడుతున్నారు. అయోధ్య రాముడు ఆనందించేలా,

భారతదేశం గర్వించేలా, ప్రపంచ చరిత్ర చెప్పుకునేలా, ఎదురు లేని తిరుగు లేని మొక్కవోని సాహసం తో, పుణ్య కారం తల పెట్టిన పుణ్యాత్ములందరికీ, శ‌తథా సహస్ర థా.. వందనం..


పునాది రాయితో పులకించిన అయోధ్య

కోట్లాదిమంది హిందువుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

వేదమంత్రాల నడుమ.. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాలకు భూమిపూజను నిర్వహించారు ప్రధాని.

హనుమాన్​గఢీలో మోదీ ప్రత్యేక పూజలు

అయోధ్యలో 10వ శతాబ్దం నాటి హనుమాన్​గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​తో కలిసి అంజన్నను దర్శించుకున్నారు.మోదీ కామెంట్స్.....


మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం మహద్భాగ్యం: ప్రధాని

ఈ మహద్భాగ్యాన్ని రామమందిర ట్రస్టు నాకు కల్పించింది: ప్రధాని

ఈనాటి జయజయధ్వనాలు విశ్వవ్యాప్తంగా వినిపిస్తాయి: ప్రధాని

విశ్వవ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు మారుమోగుతున్నాయి: ప్రధాని

ఈనాడు దేశమంతా రామమయమైంది: ప్రధాని

ప్రతిఒక్కరి మనసు దేదీప్యమానమైంది: ప్రధాని

దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో నిండిపోయింది: ప్రధాని

ఇప్పటివరకు చిన్నస్థాయి గుడి, టెంటులో ఉన్న రామమందిరం ఇకపై భవ్యమందిరంగా రూపుదిద్దుకోబోతుంది: ప్రధాని

రామమందిర నిర్మాణ సాకారానికి ఎందరో త్యాగాల ఫలితమిది: ప్రధాని

రామమందిర నిర్మాణానికి ఆత్మత్యాగం చేసిన అందరికీ 135 కోటమంది భారతీయుల తరఫున ధన్యవాదాలు: ప్రధాని

రాముడు అందరి మనసులో నిండి ఉన్నాడు: ప్రధాని

శ్రీరాముడు అంటే మర్యాద పురుషోత్తముడు: ప్రధాని

అలాంటి పురుషోత్తముడికి ఈనాడు భవ్యమందిర నిర్మాణం ప్రారంభమైంది: ప్రధాని